రాజకీయ వ్యూహకర్తగా మాత్రమే అందరికీ సుపరిచితమైన ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ తో కలిసి పనిచేసినా జేడీయూ బీజేపీకి అనుకూలంగా వ్యవహారాలు చేస్తున్న కారణంగా పీకే దానిని వ్యతిరేకించారు. దీంతో నితీష్ కుమార్ ఆగ్రహానికి గురయ్యి ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా ఆయన జాతీయ స్థాయిలో పీకే పేరు మారుమోగుతూనే ఉంది. పీకే ఏదైనా ఒక పార్టీ తరఫున ఎన్నికల వ్యూహాలు రచించాడు అంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అన్నట్టుగా వ్యవహారాలు చోటు చేసుకుంటూ వస్తున్నారు. గత ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 స్థానాల్లో 151 సీట్లు సాధించేలా చేయగలిగారు అంటే అది ప్రశాంత్ కిషోర్ వుహమనే చెప్పుకోవాలి.


 తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు బాగా పనిచేశాయి. బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తూ ప్రశాంత్ కిషోర్ వస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ ప్రాంతీయ పార్టీలను ఈ విధంగా గెలిపించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల కూటమికి తాను సారథ్యం వహించాలని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే విధంగా చేస్తూ ముందుకు పీకే ముందుకు వెళ్తున్నాడు. దీనిలో భాగంగానే బీజేపీ వ్యతిరేక పార్టీ లను తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను, తమిళనాడులోని స్టాలిన్ నేతృత్వంలోని డిఎమ్ కే ను గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బీజేపీ కి వ్యతిరేకంగా గెలిపించే విధంగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీని అణగదొక్కేందుకు బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ను  మళ్లీ అధికారంలోకి తెచ్చే విధంగా పీకే వ్యూహాలు రచిస్తున్నారు.


 ఇప్పటికే ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి ప్రశాంత్ కిషోర్ తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు. తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ ఎదురు లేకుండా ముందుకు వెళ్తోంది. ఆ పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీజేపీలకు బలం సరిపోవడం లేదు. ఈ స్థితిలో తెలంగాణ సీఎంగా కేటీఆర్ ను ప్రకటించి తాను జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ను యాక్టివ్ చేయాలని చూస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్  అవకాశం ఇస్తారా అనేది సందేహంగా మారింది. కాకపోతే వచ్చే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమిని పీకే నిలబెట్టగలిగితే  కెసిఆర్ ప్రశాంత్ కిషోర్ కు మద్దతు ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు.


 ప్రస్తుతానికైతే ప్రాంతీయ పార్టీలతో కలిసి కేసీఆర్ ముందుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు.ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ కొంతకాలంగా హడావుడి చేస్తున్నా, కేసీఆర్ దానిని మరింతగా యాక్టివ్ చేసి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఊహల్లో ఉన్నాడు. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ కూడా అదేవిధంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి తాను చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలతో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తుండడంతో భవిష్యత్తులో ఆయన మాట చెల్లుబాటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే కేసీఆర్ ఆశలకు గండి పడినట్లే అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: