సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యం గా వారి పర్సనల్ విషయాలను తెలుసుకోవడానికి ప్రతీ ఒక్కరు ఉత్సాహం చూపిస్తారు. ఒకవేళ వారు ఏదైన చిన్న పోరాపాటు చేసినా ఇక అంతే సంగతులు సోషల్ మీడియా వేదికగా వారిని వేదిస్తారు.
ఫేమస్ టీవీ యాక్టర్స్ కామ్యా పంజాబీ ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతం లో పెళ్లి చేసుకున్న కామ్యా కు పన్నెండేళ్ల కూతురు కూడా ఉంది. ఇప్పుడు కామ్యా వయసు 40 సంవత్సరాలు. అయితే ఈ వయసులో అంత పెద్ద కూతురుని పెట్టుకొని రెండు పెళ్లి ఏంటి అంటూ కామ్యా పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.
ఆమె పై తీవ్ర పదజాలంతో కామెంట్స్ చేస్తున్నారు. వయసుకొచ్చిన కూతురిని పెట్టుకొని మళీ పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా అంటూ ఆమె పై దూషణలకు దిగుతున్నారు. అయితే ఈ మాటల దాడి పై కామ్యా ఎలాంటి కామెంట్ చేయకపోయినా ఆమె స్నేహితురాలు కవితా కౌశిక్ మాత్రం స్పందించింది. తన స్నేహితురాలి పై చేస్తున్న కామెంట్స్‌ను చూసి తట్టుకోలేకపోయిన కవితా ఘాటుగానే రిప్లై ఇచ్చింది.
భర్త జీవితాంతం తోడు గా ఉంటాడని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి పిల్లలను కనటం మాత్రమే కాదు. జీవితం లో ఇంకా చాలా ఉంది. ఏదో ఒకరకంగా ఆనందం వెతుక్కునే వారిలో తప్పులు వెతికి వేలెత్తి చూపించకండి అని బుద్ధి చెప్పింది. గతంలోనూ కామ్యా ఈ ట్రోల్స్ తో ఇబ్బంది పడింది. తన ప్రియుడిని తాన పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించిన సమయంలో కూడా ఇలాంటి నటితో డేటింగ్ చేశావా అంటూ ఆమె ప్రియుడ్ని ప్రశ్నిస్తూ చాలా మంది అసభ్యకర కామెంట్లు చేశారు. అంతేకాదు అవసరం కోసం ఆమె కూతురిని కూడా అమ్మేస్తుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.