ఇద్దరి భావాలు కలిసి ... ఆలోచనలు ఒకటై ... జీవితాంతం కలిసి నడుస్తారూ అన్న నమ్మకం ఏర్పడి... రెండు మనుసుల  మధ్య ఏర్పడే బంధమే ప్రేమ. ప్రేమమధుర జ్ఞాపకం. ఎంతో మంది తమ ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోయిన వారు ఉన్నారు. తమ ప్రేమని దక్కించుకోవడానికి చరిత్ర సృష్టించిన వారు ఉన్నారు. ప్రేమంటే రెండు శరీరాల కలయిక కాదు రెండు మనసుల కలయిక. కానీ ఈ మాటలన్నీ ఒకప్పటి ప్రేమను మాత్రమే చెందుతాయి... నేటితరం ప్రేమలో ఆప్యాయతలు అనురాగాలు అర్థం చేసుకోవడాలు  ఎక్కడా కనిపించదు. నేటితరం ప్రేమను ప్రేమ అనడం కంటే ఆకర్షణ అడగడమే మేలు. ఎందుకంటే ఒకరికి ఒకరు అండగా నిలవడానికి ప్రేమించడం లేదు ఈ రోజుల్లో...ఒకరికి మరొకరి  అవసరం కోసం మాత్రమే ప్రేమిస్తున్నారు. 

 

 

 

 ఇక అవసరం కోసం పుట్టిన ప్రేమ అవసరం తీరాక ఉంటుందా  విడిపోతుంది. నేటితరం ప్రేమలన్నీ ఇలాగే ఉంటున్నాయి. కొంతమంది శారీరక అవసరం కోసం ప్రేమిస్తే ఇంకొంతమంది డబ్బు అవసరం కోసం ప్రేమిస్తారు. కొంతమంది గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలని స్టైల్ కోసం ప్రేమిస్తారు. ఇలా చాలామంది అవసరాల కోసం ప్రేమించే వాళ్ళే ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తారు. అవసరం ఉన్నంత సేపు నువ్వు కావాలి నువ్వే నా ప్రపంచం... నువ్వు లేకుండా ఒక్క నిమిషమైనా బతకలేను... నా గుండెల నిండా నువ్వే ఉన్నావు.. నీ కోసం ఎవరినైనా ఎదిరిస్తాను.. ప్రాణమైన అర్పిస్తాను... కానీ నువ్వు తోడు లేకపోతే బతకలేను. నువ్వే నా సర్వస్వం అంటూ ఎన్నో మాటలు చెబుతారు. 

 

 

 కానీ చివరికి అవసరం తీరాక కనీసం పరాయి వాళ్లకు  ఇచ్చిన రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. ఎప్పుడు ఎలా బ్రేక్ అప్ చేసుకుందామా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి ప్రేమలు ఈరోజుల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. అవసరం కోసం ప్రేమించడం అవసరం తీరాక... నువ్వే సర్వస్వం అన్న వాళ్లు కూడా నువ్వు నా జీవితంలో ఉండడం అస్సలు ఇష్టం లేదు అంటూ  చెప్తారూ... ఇలాంటి ప్రేమలు మధుర జ్ఞాపకం కాదు  చేదు జ్ఞాపకం... ఒకప్పుడు ప్రేమలో ఉన్న మధుర జ్ఞాపకాలు నేటి ప్రేమ లో ఎక్కడ ఉన్నాయి. మరీ ఈ కాలంలో సిన్సియర్ గా  ప్రేమించే వాల్లె  లేరా..  అసలు ప్రేమ అనేది లేదా  అని అంటారా.... ఎందుకు లేదు ఈ రోజుల్లో కూడా సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా తక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: