తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. నూతన పాలనాపరమైన భవనాల ను నిర్మించేందుకు ఎక్కువగా  ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రగతి భవన్ కూడా నిర్మించింది టిఆర్ఎస్ సర్కార్. ఇక ఆ తర్వాత సచివాలయంలోని భవనాలను కూల్చివేసి  నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయించింది. అయితే ఏళ్ల చరిత్ర ఉన్న సచివాలయం లోని భవనాలను కూల్చివేతను నిరసిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. గతంలోనే  సచివాలయంలోని భవనాల కూల్చివేత ఆపాలంటూ దాఖలైన పిటీషన్పై విచారణ జరిపిన హైకోర్టు... కూల్చివేత, నూతన భవనాలకు సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలని ఆ తర్వాత కోర్టు ఆదేశించిన  తర్వాతనే సచివాలయం కూల్చివేత చేపట్టాలంటూ స్టే విధించిన  విషయం తెలిసిందే. 

 

 

 ఇక తాజాగా దీనికి సంబంధించి మరో సారి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సచివాలయం లోని  భవనాల కూల్చివేత పై హైకోర్టులో వాదనలు ప్రతి వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు తెలంగాణ సర్కార్ పై ఈ విచారణలో భాగంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయంలోని భవనాలను కూల్చివేసేందుకు తెలంగాణ సర్కారు ఎందుకు అంత ఆత్రుత చూపిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కొత్త భవనాల నిర్మాణం,డిజైన్  తదితర విషయాలకు సంబంధించి సమగ్ర నివేదికను హైకోర్టులో సమర్పించాలని ప్రభుత్వానికి సూచించినప్పటికీ... ఇప్పటికీ సమగ్ర నివేదిక సిద్ధం కాలేదని ప్రభుత్వం సమాధానం చెప్పడం విడ్డూరం అంటూ హైకోర్టు తెలిపింది. 

 

 

 నూతన భవనాల పై ఇంకా డిజైన్ సిద్ధం కానప్పుడు సచివాలయంలోని ఉన్న భవనాలను కూల్చివేసేందుకు ఎందుకు ప్రభుత్వం అంత తొందర పడుతుంది అంటూ ప్రశ్నించింది. అయితే సచివాలయంలోని భవనాలను కూల్చివేసేందుకు సమగ్రంగా నిర్ణయం తీసుకున్న తెలంగాణ క్యాబినెట్... నూతన భవనాల డిజైన్కు సంబంధించిన నిర్ణయాన్ని మాత్రం ఎందుకు తీసుకోలేక పోతుంది అంటూ ప్రశ్నించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ముందు కొత్త భవనాల కు సంబంధించిన డిజైన్ ను వివరాలను సమగ్ర నివేదిక పూర్తి చేసి  హైకోర్టులో సమర్పించిన తర్వాతే.. భవనాల కూల్చివేత చేపట్టాలంటూ హైకోర్టు తెలిపింది. అప్పటివరకు హైకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సచివాలయ భవనాల కూల్చివేత నిలిపివేయాలంటూ తెలంగాణ సర్కారు ఆదేశించింది హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: