కర్నూలు జిల్లాలోని అనంతరం కోట్ల కూడలిలో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  బహిరంగ సభ నిర్వహించిన ప్రసంగించిన విషయం  తెలిసిందే. సుగాలి ప్రీతికి అత్యాచారం కేసులోని నిందితులను  శిక్షించాలని కోరుతూ.. భారీ ర్యాలీ నిర్వహించింది జనసేన పార్టీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి జనసేన కార్యకర్తలు అభిమానులు విద్యార్థులు బీజేపీ నేతలు అందరూ అధిక సంఖ్యలో హాజరయ్యారు. కాగా  సుగాలి ప్రీతీ  ప్రతి అత్యాచారం హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. ఈ ర్యాలీ లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ... స్కూల్కి వెళ్లి బాగా చదువుకొని ఇంటికి తిరిగి రావలసిన బిడ్డ సామూహిక అత్యాచారానికి గురై  చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 

 

 

 సుగాలి ప్రీతి తన దృష్టికి ఎలా వచ్చిందో ఆయన వివరించారు. మూడు నెలల క్రితం మంగళగిరిలోని తమ పార్టీ ఆఫీస్ కు... సుగాలి ప్రీతీ  తల్లిదండ్రులు వచ్చారని... ప్రీతి పై జరిగిన ఘటన గురించి చెప్పి కన్నీరుమున్నీరు అయ్యారు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. వాళ్లు తమ బిడ్డకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అంటూ తెలిపారు. ఆ సమయంలో తనకు ఎంతో నిస్సహాయత గా అనిపించిందని... అందుకే సుగాలి  ప్రీతికి న్యాయం జరగాలనే  ఉద్దేశంతోనే ఈ భారీ ర్యాలీ నిర్వహించినట్లు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. స్కూల్ నుంచి తిరిగి రావలసిన వారి  బిడ్డను  సామూహిక  అత్యాచారం చేసి చంపేశారని.. ఆ విద్యార్థిని తల్లి కన్నీరుమున్నీరయ్యారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. 

 

 

 అది కూడా రోడ్డుపై వెళ్లే పోకిరీలు చేసిన అత్యాచారం కాదని... దేవాలయం తో సమానమైన చదువుల గుడిలోనే అత్యాచారం  జరగడం దారుణం అంటూ తెలిపారు.ఆ తల్లి రోదన  తను ఎంతో నిస్సహాయత గురి చేసింది అని తెలిపిన జనసేనని... హైదరాబాద్ లో జరిగిన దిశా సంఘటనకు ముందే ప్రీతి అత్యాచారం హత్య ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే దిశగా ఘటనలో నిందితులను రోడ్ల పైకి తీసుకువచ్చి ఎన్కౌంటర్ చేసినప్పటికీ... సుగాలి ప్రీతికి మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు న్యాయం చేయలేదు అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న చట్టాలన్ని బలహీనులకు ఎంతో బలంగా.. బలవంతులకు ఎంతో బలహీనంగా పనిచేస్తున్నాయని అందుకే నేరస్తులకు సరిగ్గా శిక్షలు పడడం లేదు అంటూ వ్యాఖ్యానించారు.దిశా ఘటనలో  దేశం మొత్తం రోడ్ల పైకి చేరి నిందితులకు శిక్ష పడేలా నిరసనలు తెలిపినట్లుగానే ... సుగాలి ప్రీతీ  ఘటనలో నిందితులకు  కూడా శిక్షలు పడేలా కర్నూలు యువత మొత్తం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రీతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకపోవడం వల్లే ఈ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతికి న్యాయం జగననప్పుడు కర్నూలులో జ్యుడిషియల్ రాజధానిగా ఏర్పాటు చేయడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: