ప్రేమకు తొలి మెట్ట ఆకర్షణ అంటుంటారు. మరి ఆకర్షణ ఎక్కడ నుంచి పుడుతుంది. అందం నుంచే ఎక్కువ అంటుంటారు. మరి ఇంతకీ అమ్మాయిల్లో అబ్బాయిలను ఆకర్షించేవి ఏవి.. అమ్మాయిల అందానికి అబ్బాయిలు వాల్యూ ఇస్తారా.. లేక సెక్సీ ఫిగర్ ఉన్న అమ్మాయిల వైపు ఎట్రాక్ట్ అవుతారా..

 

 

ఈ విషయంపై చాలా పరిశోధనలు జరిగాయి. ఫైనల్ గా తేలిందేమిటంటే.. అబ్బాయిలు మనస్ఫూర్తిగా ఇష్టపడేవారిలో శరీరాకృతి కంటే.. ముఖం అందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారట చాలా మంది. అబ్బాయిలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ప్రేమలో పడేది అందమైన అమ్మాయిల ముఖాలు చూసేనట. అంటే ఫిగర్ కంటే ఫేస్ వాల్యూకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట.

 

ఇక ప్రేమకు సంబంధించిన మరిన్ని విషయాల్లోకి వెళ్తే.. అమ్మాయిలకు తమ ప్రియుడి ఎదురుగా కూర్చుంటే నచ్చుతుందట. అలా ఎదురుగా కూర్చుని కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడితే నచ్చుతుందట. అయితే ఈ విషయంలో అబ్బాయిల టేస్ట్ వేరు.. అబ్బాయిల పక్క పక్కన కూర్చుని మాట్లాడటానికి ఎక్కువగా ఇష్ట పడతారట.

 

 

అలాగే ఈ ప్రేమలో ఆనందంతో పాటు విషాదమూ ఉంటుంది. హృదయం ఓర్చుకోలేనిదీ గాయం అన్న పాట విన్నారు.. కదా.. అది నిజమే. ఇష్టమైన వాళ్లు దూరమైతే గుండె బద్దలైనంత పనవుతుంది. ఈ పరిస్థితికి ఓ పేరు కూడా ఉంది. దాన్నే బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ అంటారట. ఇవండీ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమ కబుర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: