వారు ఇంకా పాఠశాలల్లోనే చదువుతూ ఉంటారు... కానీ ఆ వయస్సులోనే వారికి ప్రేమ పుడుతుంది.. ఇక ఆ తర్వాత ప్రేమ పేరుతో సినిమాలు శికార్లు. హద్దులు మర్చిపోయి రొమాన్సులు... ఇలా  ఉంది నేటితరం ప్రేమల ఎవ్వరం. నేటి రోజుల్లో సిన్సియర్గా ప్రేమించే   వాళ్ళు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తు ఉంటారు. కానీ ఎక్కువగా కనిపించేది మాత్రం.. అప్పుడప్పుడే పెరుగుతున్న వయస్సులో  ఇతరుల పట్ల వచ్చిన ఆకర్షణని  అని ప్రేమగా భావించి... ప్రేమ ముసుగులో మునిగిపోయి.. కెరియర్ నాశనం చేసుకోవడం. ప్రస్తుతం ఈ జనరేషన్లో ఉన్న 90 శాతం మంది యువత ప్రేమ కారణంగానే కెరీర్లో విజయం సాధించలేక పోతున్నారు. ఓ వైపు ప్రేమలో  సక్సెస్ సాధిస్తూనే మరోవైపు కెరీర్లో కూడా విజయం సాధిస్తున్న వారు  కోటికో నోటికో ఒక్కరు ఉన్నారు. 

 

 

 కొంతమందికి స్కూల్ డేస్లోనే ప్రేమ మొదలైతే... కొంతమందికి కాలేజ్ డేస్  ప్రేమ మొదలవుతుంది.ప్రేమ ఎప్పుడు పుడితే ఏంటి కెరియర్ ను నాశనం చేయటానికి అన్నట్లుగా ఉన్నాయి నేటి ప్రేమాయణాలు.  ఇలాంటి ప్రేమాయణాలు ప్రస్తుతం రోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రేమకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో  కెరియర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. ప్రేమలో విజయం సాధించినప్పటికీ కెరీర్ సరిగా లేకపోతే జీవితంలో ఎన్నో ఇబ్బందులు తప్పవు. ఆనందంగా బతకడానికి ప్రేమ ఎంతో అవసరం.. అదే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కెరియర్ పై దృష్టి పెట్టడం కూడా అంతే అవసరం. నేటితరం యువత మాత్రం ప్రేమ మత్తులో కెరియర్ ని  గాలికి వదిలేస్తున్నారు. ప్రేమ మత్తులోనే మునిగితేలుతూ... సినిమాలు షికార్లకు అలవాటుపడి... పార్కులో చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

 

 

 చదువు విషయం వచ్చేసరికి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా మంది యువత ప్రేమలో విజయం సాధించినప్పటికీ కెరియర్ లో మాత్రం బొక్క బోర్లా  బాధపడిపోతుంటారు. ప్రేమ తమ దరికి  చేరినప్పటికీ కెరీర్ మాత్రం అందనంత దూరంలో కి వెళ్ళిపోతుంది. దీంతో లైఫ్లో కెరియర్ పోయి ఎటు తేల్చుకోలేని స్థితిలో పడిపోతున్నారు. కొంతమంది ప్రేమలో పడి ఆ తర్వాత విడిపోయిన తర్వాత.. తెలిసీ తెలియని వయసులోనే వారేదో అమర ప్రేమికులు అన్నట్లుగా.. వ్యవహరిస్తూ దేవదాసు లాగా మారిపోయి కెరీర్ను గాలికి వదిలేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: