ప్రేమంటే వందేళ్ల పాటు కలిసి ఉండడం... ప్రేమంటే జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను నింపుకోవడం... ప్రేమంటే చెప్పలేని గొప్ప అనుభూతి... ఇలాంటి ప్రేమలు నాటి తరంలో మాత్రమే చూశామ్...  కానీ నేటి తరం విషయానికి వస్తే మాత్రం.. నేటి రోజుల్లో సిన్సియర్గా ప్రేమించే   వాళ్ళు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తు ఉంటారు. కానీ ఎక్కువగా కనిపించేది మాత్రం.. అప్పుడప్పుడే పెరుగుతున్న వయస్సులో  ఇతరుల పట్ల వచ్చిన ఆకర్షణని  అని ప్రేమగా భావించి... ప్రేమ ముసుగులో మునిగిపోయి.. కెరియర్ నాశనం చేసుకోనే వాళ్ళు. కొంతమందికి స్కూల్ డేస్లోనే ప్రేమ మొదలైతే... కొంతమందికి కాలేజ్ డేస్  ప్రేమ మొదలవుతుంది. అయితే ఈ రోజుల్లో ఎంత త్వరగా ప్రేమించుకుంటున్నారో  అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇలాంటి ప్రేమాయణాలు ప్రస్తుతం రోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రేమ మోజులో పడి కెరీర్ను గాలికి వదిలేస్తున్నారు. 

 

 

 అయితే నేటి తరం ప్రేమలు కేవలం అవసరాల కోసం మాత్రమే పుడుతున్నాయి... కొంతమందికి  డబ్బులు అవసరం కోసం ప్రేమ పుడితే ఇంకొంతమందికి శారీరక అవసరం కోసం ప్రేమలు పుడుతున్నాయి .. అవసరం కాస్త తీరాక ప్రేమికులు బ్రేకప్ పేరుతో విడిపోతున్నారు. ఒకప్పుడు ఇద్దరి మనసులు... ఇద్దరి భావాలు ఇద్దరి ఆలోచనలు... ఇద్దరు ఇష్టాలు కలిస్తే ప్రేమ చిగురించింది. ఇప్పుడు మాత్రం కాస్ట్లీ బైక్ ఉంటే.. అమ్మాయి స్టైల్ గా డ్రెస్ చేసుకుంటే.. కుర్రాడి హెయిర్ స్టైల్ బాగుంటే.. అమ్మాయి ఫిగర్ బాగుంటే... ఇలా బాహ్య అందాలను చూసి మాత్రమే ప్రేమలు పుడుతున్నాయి. ఇద్దరి మనసులు కలిసి పుట్టిన ప్రేమ లు  నేటి తరంలో చాలా తక్కువే. 

 

 

 నాటి తరం ప్రేమబంధం ఒక్కసారి పుడితే  వందేళ్ల వరకు వారి ప్రేమ ప్రయాణం కొనసాగేది..  నేటితరంలో మాత్రం ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు అంటే కొత్త లవర్ దొరికేంతవరకు. ఎందుకంటే ప్రస్తుతం ప్రేమ కంటే బ్రేకప్ లు  ఎక్కువ అవుతున్నాయి. తాము ప్రేమిస్తున్న వారికి బ్రేకప్ చెప్పడం ఆ తర్వాత కొత్త వారిని వెతుక్కుని లవ్ చేయడం లాంటివి జరుగుతున్నాయి నేటి రోజుల్లో. కొంతమంది ప్రేమ ముసుగులో ఇద్దరు ముగ్గురిని ఒకేసారి ప్రేమించడం లాంటివి కూడా చేస్తున్నారు. ఎంతో కాలం ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు ఆ బోర్ కొట్టగానే బ్రేకప్ పేరుతో సింపుల్ గా విడిపోతున్నారు. ఇక ఆ తర్వాత మరొకరి  కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: