ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి... ఒకప్పుడైతే ప్రేమించిన వాళ్ళు పెద్దలకు తన ప్రేమ విషయం చెప్పి ఒప్పించడానికి భయపడి ప్రేమను వదులుకోవడానికి కూడా సిద్ధపడే  వాల్లు...  కానీ నేటి తరం యువత మాత్రం ప్రేమించడమే కాదు ధైర్యంగా ప్రేమను పెద్దవాళ్ళ దగ్గర చెప్పి ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఎక్కువశాతం ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే కొంతమంది పెద్ద వాళ్ళని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఒకప్పుడు ప్రేమ పెళ్లిళ్లు తక్కువ జరిగి పెద్దలు కుదిర్చిన పెళ్లి లో ఎక్కువ జరిగితే... ఈ జనరేషన్లో మాత్రం ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా పెద్దలు కుదిర్చిన పెళ్లి లో చాలా తక్కువగా జరుగుతున్నాయి. రోజురోజుకు లవ్ మ్యారేజ్ భారీగానే జరుగుతున్నాయి. 

 

 

 అయితే లవ్ మ్యారేజ్ లు జరుగుతున్నాయి కానీ ప్రేమ పెళ్లి జరిగిన తర్వాత మాత్రం విడిపోతున్న జంటలు ఎక్కువ అవుతున్నారు  ఈ రోజుల్లో. కొంతమంది తెలిసీ తెలియని వయసులో ఆకర్షణనే  ప్రేమగా భావించి... కొన్నాళ్ల  పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగే... కెరీర్ పరంగా ఎలాంటి విజయం సాధించకపోయినప్పటికీ...పెద్దలని  ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లు వరకు బాగానే ఉన్నప్పటికీ... ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం ఆర్థిక ఇబ్బందులు రావడం లాంటివి జరిగి  ప్రేమ పెళ్లిళ్లు కాస్తా పెటాకులు గా మారిపోతున్నాయి . ఇంకొంతమంది కెరియర్ లో సెట్ అయినప్పటికీ.. పెళ్లికి ముందు చూపించిన ప్రేమ పెళ్లయిన తర్వాత చూపించడం లేదనే కారణంతో మనస్పర్థలు వస్తాయి కొంతకాలానికి విడాకులు తీసుకొని వెళ్ళి విడిపోతున్నారు. 

 

 

 ప్రస్తుత కాలంలో ఇలా పెటాకులు అవుతున్న ప్రేమ పెళ్లిళ్లు  భారీగానే ఉంటున్నాయి. ఒకరిపై ఒకరికి  నమ్మకం లేకపోవడం...  ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం... అనవసరంగా అనుమానాలు పడుతూ ఉండడం.. లేదా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకోవటం  ఇలా కారణమేదైనా ప్రేమ పెళ్లిళ్లు మాత్రం ఎక్కువ కాలం నిలవడం లేదు ఈ రోజుల్లో. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని వారే కాదు..  పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు కూడా... సరిగ్గా దాంపత్య జీవితాన్ని గడపలేక పోతున్నారు. ఆ సమయంలోనే మనస్పర్ధలు వచ్చే విడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: