కొంత మంది భార్యా భ‌ర్త‌లు మినిమం గ్యాప్ కూడా మెయిన్‌టెయిన్ చెయ్య‌కుండా పిల్ల‌ల‌ను కంటూ ఉంటారు. కాని దాని వ‌ల్ల త‌ల్లి బిడ్డ‌ల‌కు ఇద్ద‌రికి కూడా ఆరోగ్య ప‌రంగా అంత మంచిది కాదు.  మ‌హిళ‌లు.. ఒక ఏడాది గ్యాప్ లోనే రెండో కాన్పుకు సిద్ద‌మ‌వుతారు. ఇది త‌ల్లీబిడ్డ ఆరోగ్యాలపై ఎటువంటి ప్రభావాల‌ను చూపుతాయి? అస‌లు మొద‌టి కాన్పుకు, రెండ‌వ కాన్పుకు మ‌ధ్య ఎంత గ్యాప్ ఉంటే మంచిది!? అనే విష‌యాల గురించి ఈ రోజు సుఖ‌సంసారం శీర్షిక‌లో తెలుసుకుందాం.

 

 డబ్ల్యూహెచ్ఓ( ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ) ప్ర‌కారం మొద‌టి కాన్పుకు, రెండ‌వ కాన్పుకు మ‌ధ్య 2సంవ‌త్స‌రాల 9 నెల‌ల కాలం ఉంటే మంచిది. భార‌త ప్ర‌భుత్వ మ‌హిళాశిశు సంక్షేమ శాఖ వారి ప్ర‌కారమేమో మొద‌టి కాన్పుకు, రెండ‌వ కాన్పుకు మ‌ధ్య కనీసం 3 సంవ‌త్స‌రాల గ్యాప్ ఉండాలి. చాలా అధ్యాయాల ప్ర‌కారం ఎట్ లీస్ట్ 18 నెలల గ్యాప్ మెయింటేన్ అయినా చేయాలి. దీని ప్ర‌కారం మొద‌టి కాన్పుకు, రెండ‌వ కాన్పు కు 18 నుండి 3 ఏళ్ళ మేర‌కు ఎవ‌రి పాజిబిలిటీస్ ను బ‌ట్టి వారు గ్యాప్ ఇచ్చుకుంటే త‌ల్లికి, బిడ్డ‌కు మంచిది. ఎందుకంటే..

 

మ‌న‌దేశంలో 86 శాతం మంది గ‌ర్భిణిల‌కు నార్మ‌ల్ డెలివ‌రీ అవుతుంటే. మిగిలిన 14 శాతం మందికి సిజేరియ‌న్ అవుతుంద‌న్న మాట‌. నార్మ‌ల్ డెలివ‌రీ వారితో పోల్చితే సిజేరియ‌న్ వాళ్ళు రెండ‌వ డెలివ‌రీకి కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకోవ‌డం ఉత్త‌మం. నార్మ‌ల్ డెలివ‌రీ అయిన వారిలో 18 నెల‌ల గ్యాప్ త‌ర్వాత రెండ‌వ కాన్పు వ‌స్తే…అందులో 79 శాతం రెండ‌వ సారి కూడా నార్మ‌ల్ డెలివ‌రీ అవుతుందట‌.! మిగిలిన 7 శాతం మందికి వివిధ కార‌ణాల రీత్యా సిజేరియ‌న్ అవుతుంద‌ట‌. ఇంకా చెప్పాలంటే..

 

ఫ‌స్ట్ డెలివ‌రీకి సెకెండ్ డెలివ‌రీకి క‌నీసం 18 నెల‌ల గ్యాప్ కూడా లేకుంటే క‌లిగే న‌ష్టాలేమిటంటే... మాయ జార‌డం, త‌ర‌చుగా యోని భాగం ఎర్ర‌గా మారి, విప‌రీత‌మైన బ్లీడింగ్ అవ్వ‌డం. నెల‌లు నిండ‌కుండానే పిల్ల‌లు పుట్ట‌డం. పుట్టిన పిల్ల‌ల బ‌రువు సాధార‌ణంగా త‌క్కువ‌గా ఉంటుంది. శారీర‌కంగా బ‌ల‌హీనంగా ఉంటారు. వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. వెంట‌వెంట‌నే పిల్ల‌లు పుడితే వారిని పెంచ‌డంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆర్థిక ప‌ర‌మైన భారం ఎక్కువ‌గా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త దెబ్బ తింటుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి క‌బ‌ట్టి క‌నీసం మూడు సంవత్స‌రాలు గ్యాప్ మెయిన్‌టెయిన్ చెయ్య‌డం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: