తెలుగుదేశం పార్టీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ శాసన మండలి నిర్ణయం రద్దు విషయంలో మీడియా ముందు ఇటీవల అతిగా ప్రవర్తించడం జరిగింది. మూడు రాజధానుల బిల్లు మరియు సి ఆర్ ఏ బిల్లు శాసన మండలి దృష్టికి వెళ్లడంతో ఆ బిల్లులను యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సెలక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. అయితే తాజాగా యనమల రామకృష్ణుడు వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే శాసనమండలిలో రాజధాని బిల్లులను ఆపేసి పెద్ద గొప్పగా రూల్ 71 మరియు సెక్షన్ 154 అనే వాటిని తెరపైకి తీసుకువచ్చి అడ్డుకొని వైసీపీ పార్టీకి రూల్స్ చెప్పే విధంగా వ్యవహరించడం జరిగింది.

 

అదే సమయంలో శాసనమండలిని రద్దు అంటూ అసెంబ్లీలో ఆ బిల్లును ఆమోదింప చేసి కేంద్రం ముందు పెట్టడం జరిగింది. ఇటువంటి తరుణంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ బిల్లు గురించి జగన్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానులు గురించి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో రాజధానుల కు సంబంధించి మరియు crda బిల్లులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సెలక్ట్ కమిటీకి ఆ బిల్లులను పంపడం జరిగింది.

 

కానీ 14 రోజుల్లోపు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాకపోవడం తో బిల్లు ఆమోదం పొందినట్లే అని రోజా అన్నారు. దీంతో యనమల రామకృష్ణుడు తెరపైకి తెచ్చిన రూల్ 71 మరియు సెక్షన్ 154 ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినట్లే అని ఏపీ రాజకీయాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇదే తరుణంలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర అంటూ పెట్టిన కార్యక్రమంపై కూడా రోజా విమర్శలు చేసింది. చంద్రబాబు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని రోజా విమర్శించారు. ప్రజలు ఆల్రెడీ చైతన్యవంతులు అందువల్లే నారా లోకేష్ ని దారుణంగా మంగళగిరిలో ఓడించారని ఆమె తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: