ఆయనో టీఆర్‌ఎస్ నేత.. జనానికి మేలు చేస్తానంటూ బిల్డప్ ఇచ్చేవాడు.. ప్రత్యేకంగా మహిళలకు రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికేవాడు.. రుణాల పేరుతో మహిళలకు వల వేసేవాడు.. ఆ తర్వాత వారి ఫోన్లకు బూతు వీడియోలు పంపేవాడు.. న్యూడ్ వీడియో కాల్స్ తో వేధించాడు.



ఓ లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదుతో అరెస్టయిన ఈ నాయకుడి బూతు బాగోతం అంతా ఇప్పుడు బయటకు వస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. టీఆర్ఎస్ నేత కందగట్ల భాస్కర్ మహిళలను లైంగికంగా వేధిస్తున్న కేసులో అరెస్టయ్యాడు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అతడిని త్వరలోనే మరోసారి విచారించాలని నిర్ణయించారు పోలీసులు .



ఈ కేసు ద్వారా పార్టీ పరువు పోతుండటంతో అతడిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. భాస్కర్ రుణాల మాయతో 150 మందికి పైగా మహిళలను వేధించాడట. విచారణలో భాగంగా భాస్కర్ మొబైల్ ఫోన్‌ ఓపెన్ చేసిన పోలీసులు షాకయ్యారట. అతడి ఫోన్లో వందల సంఖ్యలో బూతు వీడియోలు ఉన్నాయట.



రుణాలు ఇప్పిస్తానంటూ మహిళలతో మెల్లగా పరిచయం పెంచుకుంటాడట భాస్కర్. ఆ తర్వాత బూతు వీడియోలు పంపేవాడట. పలు సిమ్ కార్డులను మార్చుతూ వాట్సాప్‌లో న్యూడ్ వీడియో కాల్స్ చేసేవాడట. ఇలా భాస్కర్‌ వేధింపులకు గురైన వారిలో హైదరాబాద్‌లో పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్‌ కూడా ఉంది.



తాజాగా ఓ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భాస్కర్ బూతు పురాణం వెలుగు చూసింది. అయితే ఇది భాస్కర్ కు కొత్తేమీ కాదట. 2007లోనే ఇలాంటి కేసులోనే ఓ రెండేళ్లు జైలుకు కూడా వెళ్లాడట ఈ భాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: