రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు దేశంలోని చాలామంది నేతలతో పరిచయాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎన్ని సార్లు తెగదెంపులు చేసుకున్న, ఇప్పటికీ కొందరు అగ్రనేతలతో పరిచయాలు మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. 2019 ఎన్నికల ముందు మోడీ, అమిత్ షాలని చెడామడా తిట్టిన బాబు...ఎన్నికల తర్వాత వారి అండకోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బాబు ఎన్ని ప్రయత్నాలు చేసిన మోడీ, షాలు మాత్రం కరగడం లేదు. బాబుకు అవకాశం ఇవ్వడం లేదు.

 

అయితే వారు అండ లేకపోయిన బాబుకు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజనాథ్ సింగ్‌ల మద్ధతు ఎప్పుడు ఉంటూనే ఉందని తెలుస్తోంది. వీరితో పాటు అగ్రనేత ఎల్‌కే అద్వానీ సపోర్ట్ కూడా బాబుకు ఉంది. కాకపోతే వీరి పరిధిలో ఉన్న అంశం వరకే వారు బాబుకు సాయం చేస్తున్నారు తప్ప..మోడీ, షాల పరిధిలో ఉండే విషయాల్లో మాత్రం కష్టమైపోతుంది. ఇక ఈ విధంగా బాబు కేంద్రంలో రహస్య స్నేహితులు ఉన్నట్లు జగన్‌కు కూడా ఉన్నారని తెలుస్తోంది. జగన్ కూడా బాబు మాదిరిగానే కొందరు నేతల అండతో ముందుకెళుతున్నట్లు సమాచారం.

 

అలా ఈ మధ్య కాలంలో జగన్‌కు అండగా ఉంటున్న నేత ఎవరని అంటే? జి‌వి‌ఎల్ నరసింహారావు పేరు ఠక్కున చెప్పేయొచ్చు. బాబు అంటే అసలు పడని జి‌వి‌ఎల్ జగన్‌కు పరోక్షంగా మద్ధతు ఇస్తున్నట్లు ఇప్పటికే పలు మార్లు రుజువైంది. ముఖ్యంగా ఇటీవల ఏపీలో రాజుకున్న మూడు రాజధానులపై కేంద్రం కలగజేసుకోవాలని టీడీపీతో సహ పలు విపక్ష పార్టీలు కోరాయి. ఇక ఇదే సమయంలో జి‌వి‌ఎల్ వచ్చి, రాజధానితో మాకు సంబంధం లేదు. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోనే ఉందంటూ చెప్పి షాక్ కూడా ఇచ్చారు.

 

ఈయన చెప్పిన విధంగానే పార్లమెంట్ నుంచి కూడా సమాధానం వచ్చింది. దీంతో షాక్ అవ్వడం టీడీపీ వంతు అయింది. సరే రాజధాని విషయం పక్కనబెడితే మండలి రద్దు విషయంలో ఏమన్నా కలుగజేసుకుంటారంటే, అందులో కూడా జి‌వి‌ఎల్ తెరపైకి వచ్చి మండలి వ్యవహారంలోనూ అంతా రాజ్యాంగబధ్ధంగా జరుగుతుందని చెప్పి పసుపు తమ్ముళ్ళ మైండ్ బ్లాంక్ చేశారు. మొత్తానికి అవసరమైన ప్రతిసారి జి‌వి‌ఎల్ ఏపీ పోలిటికల్ స్క్రీన్ పైకి వచ్చి జగన్‌కి ఇన్ డైరక్ట్ సపోర్ట్ ఇచ్చేస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: