లగడపాటి రాజగోపాల్...రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన వ్యక్తి. తన సర్వేల ద్వారా జనాలకు దగ్గరైన నేత. అయితే ఇటీవల కాలంలో ఆయన సర్వేలు వరుసగా ఫెయిల్ కావడంతో ఆయన మళ్ళీ పోలిటికల్ స్క్రీన్ మీద కనపడటం లేదు. ఏపీలో రాజకీయాలు రాజధాని చుట్టూ తిరుగుతున్న ఆయన నోరు మెదపడం లేదు. అయితే ఇంత జరుగుతున్న లగడపాటి బయటకు రాకపోవడానికి కారణాలు ఏంటని ఆయన సర్వేల అభిమానులు బుర్రలు బద్దలగొట్టుకుంటున్నారట.

 

సర్వేలు ఫెయిల్ అవ్వడం వల్ల మొహం చూపించలేకపోతున్నారా?లేక ఇదంతా నాకెందుకులే అని సైలెంట్‌గా ఉన్నారా? అనే విషయాల్లోకి వెళ్ళేముందు...లగడపాటి పోలిటికల్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే, ఆయన 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి విజయవాడ ఎంపీగా గెలిచారు. ఆ రోజుల్లోనే ఆయన సర్వేలు చేసి కచ్చితమైన రిపోర్టులు ఇచ్చేవారు. ఇక తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరగడం, పార్లమెంట్‌లో లగడపాటి పెప్పర్ స్ప్రే చల్లి ఫేమస్ అవ్వడం, నెక్స్ట్ రాజకీయాల నుంచి తప్పుకోవడం జరిగిపోయాయి.

 

అయితే రాజకీయాల నుంచి తప్పుకున్న ఆయన సర్వేలని మాత్రం వదల్లేదు 2014లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. అలాగే ఫలితాలు కూడా వచ్చాయి. ఇక 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల నుంచి ఆయన సర్వేలు రివర్స్ అవ్వడం మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిపిన మహాకూటమి గెలుస్తుందని అన్నారు. ఆ అంచనాలు తారుమారయ్యాయి. ఇక 2019 ఏపీలో టీడీపీ గెలుస్తుందంటే, వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఇక ఈ దెబ్బతో ఆయన మళ్ళీ మీడియా ముందుకు రాలేదు.

 

కాకపోతే ప్రస్తుతం అమరావతి ఇష్యూ ఇంతలా నడుస్తున్న ఆయన సైలెంట్ గానే ఉన్నారు. అయితే అమరావతి కోసం జే‌ఏసిగా ఏర్పడిన వారు లగడపాటిని ఉద్యమంలోకి తీసుకురావాలని ట్రై చేశారట. కానీ లగడపాటి మాత్రం జగన్ అనుకున్నది చేస్తాడు. ఎన్ని ఆందోళనలు చేసిన ఉపయోగం ఉండదు, కాబట్టి అమరావతి విషయంలో ఏం మాట్లాడనని చెప్పేసారట. మొత్తానికి ఇలా సర్వే బాబా సైలెంట్ అయిపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: