జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు మీడియా మరీ పచ్చి అబద్ధాలను వండి వార్చేస్తోంది. గడచిన పదేళ్ళుగా చేస్తోంది అదే లేండి. కానీ జగన్ సిఎం అయిన తర్వాత వండి వార్చే కథనాలు మరీ ఎక్కువైపోయాయి. ఇందుకు తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ.  ఇంతకీ ఏం జరిగిందంటే  ప్రధానమంత్రి నరేంద్రమోడితో జగన్ దాదాపు గంటకుపైగా భేటి అయిన విషయం తెలిసిందే. వాళ్ళిద్దరూ ఏ అంశాలపై మాట్లాడుకున్నారనే విషయాలను ఎవరికి వారుగా అంచనా వేసుకోవాల్సిందే.

 

ఇక్కడే జగన్ పై తనకున్న అక్కసునంతా చంద్రబాబు మీడియా బయటపెట్టేసుకుంది. మోడితో భేటి తర్వాత జగన్ బయటకు వచ్చిన పది నిముషాలకంతా బ్రేకింగ్ న్యూస్ పేరుతో  రచ్చ చేయటం మొదలుపెట్టింది. ఇంతకీ బ్రేకింగ్ న్యూస్ సారాంశం ఏమిటయ్యా అంటే  జగన్ కు ప్రధాని అక్షింతలు వేశారట. విద్యుత్ రంగంలో పిపిఏల సమీక్షపై  మోడి చాలా సీరియస్ అయ్యారట.

 

ఇటీవలే దావోస్ లో  ముగిసిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొన్న పారిశ్రామికవేత్తలంతా  ఏపిలో పిపిఏల సమీక్షలపైనే చర్చించుకున్నారంటూ పెద్ద జోక్ పేల్చారు. అలాగే నరేగా పథకం క్రింద ఇచ్చిన నిధులను ఎందుకు  మళ్ళించారంటూ నిలదీశారట. సరే ఇలానే చాలా చెత్తను పోగేసి బ్రేకింగ్ న్యూస్ క్రింద ఇచ్చేసుకని తృప్తి పడ్డారు లేండి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భేటి మోడి-జగన్ మధ్య మాత్రమే జరిగింది. తమ సమావేశంలో ఏఏ అంశాలపై చర్చించుకున్నామన్న విషయాన్ని ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే కానీ బయటకు తెలిసే అవకాశం లేదు. మోడి చెప్పరు అలాగే జగన్ కూడా ఏమీ చెప్పలేదు. మరి ఇద్దరి మధ్య జరిగిన భేటిలోని అంశాలు చంద్రబాబు మీడియాకు ఎలా చేరింది ? అంటే భేటిపై ఊహించుకుని జగన్ పై బురద చల్లేయాలని ముందే డిసైడ్ అయినట్లున్నారు. అనుకున్నట్లే చెత్త మొదలుపెట్టేశారు. కనీసం ఒక్కరోజైనా ఆగుంటే ఎవరో ఎంపి చెప్పుంటారులే అనుకునే  అవకాశం ఉండేది. అలాకాకుండా భేటి అయిన పది నిముషాలకే బ్రేకింగ్ అంటూ చెత్తను పోగేస్తే ఏమిటర్ధం ?

మరింత సమాచారం తెలుసుకోండి: