గుమగుమలాడే మసాలాలు దట్టించిన బిర్యానీ తినాలని ఎవరికి ఉండదు. ముందే హైదరాబాద్ నగరం బిర్యాని కి పెట్టింది పేరు. హైదరాబాద్ నగర బిర్యాని కేవలం నగరవాసులకు కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫెవరెట్ గా  ఉంటుంది. ఎన్ని వెరైటీస్ తిన్న శాటిస్ఫ్యాక్షన్ ఉండాలి  కానీ బిర్యానీ తింటే మాత్రం అదో సపరేటు శాటిస్ఫ్యాక్షన్ ఉంటుంది. అందుకే ఎవరైనా బిర్యానిని  ఎంజాయ్ చేస్తూ తింటుంటారు. అయితే బిర్యానీ ఖరీదు ఎంత ఉంటుంది సింగిల్ బిర్యానీ ₹1000 లోపల ఉంటుంది. పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లో కాస్త ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఒక్క బిర్యాని కి 50వేల రూపాయలు ఎప్పుడైనా చెల్లించార. ఓ వ్యక్తి మాత్రం చెల్లించాడు. అదేంటి ఒక్క బిర్యానికి 50 వేల రూపాయలా  అంటారా... స్టోరీ లోకి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది. 

 

 

 ప్రస్తుతం బిర్యానీ ప్రియులందరూ బిర్యానీ కావాలి అంటే హోటల్ కి వెళ్లి తినే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత హోటల్కు వెళ్లి బిర్యాని తినే జనాలు  చాలా తక్కువ అయిపోయారు. బిర్యానీ తినాలనిపిస్తే చాలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లో కూడా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లను బురిడీ కొట్టించి  వేలకు వేలు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు . ఇలాంటి ఘటనలు రోజుకొకటి తెరమీదకు వస్తూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ... అవగాహన చేపట్టినప్పటికీ జనాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు. 

 

 

 ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. తాజాగా  హైదరాబాద్ టెక్కీని  బురిడీ కొట్టించాడు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ నగరానికి చెందిన టెక్కీ. జొమాటో యాప్  లో బిర్యానీ ఆర్డర్ చేసాడు. అయితే అతనికి బిర్యానీ కి బదులు సాంబార్ రైస్ వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కస్టమర్ కేర్ నెంబర్ నెట్లో సెర్చ్ చేయగా..  ఫోన్ నెంబర్ వచ్చింది. ఆ వ్యక్తి ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. ఇక ఫోన్ కాల్ నేరుగా సైబర్ నేరగాళ్లకు వెళ్లడంతో ఆ టెక్కీకి మాయమాటలు చెప్పి రిఫండ్ ఇస్తామంటూ ఆ టెక్కిని బురిడీ కొట్టించి ఆ వ్యక్తి ఖాతాలో  నుంచి 50 వేల రూపాయలు కా చేశారు. కాగా దీనిపై ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: