ఇప్పటికే కరోనా దెబ్బకు కాకుల్లా ప్రజలు అల్లాడుతుంటే, ఇప్పుడు మరో పిడుగు లాంటి వార్త చెప్పారు శాస్త్రవేత్తలు.. ఈ ప్రపంచంలో మనుషులను ప్రశాంతంగా బ్రతకనిచ్చేలా లేవు ఈ వైరస్‌లు అనుకునేలా ఇవి వ్యాప్తి చెందుతున్నాయి.. అయితే ఇందులో కొన్ని కొన్ని వైరస్‌లు ప్రాణంతకంగా మారుతుంటే, అంటే చైనాలో వచ్చిన కరోనా వైరస్ లాగా రెచ్చిపోవడం అన్నమాట. మరి కొన్ని వైరస్‌ల వల్ల ప్రాణాలకు హాని లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు..

 

 

ఇకపోతే తాజాగా బ్రెజిల్‌లోని ఓ కృత్రిమ సరస్సులో సరికొత్త వైరస్‌ను కనుగొన్నారని తెలుపుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్‌కు బ్రెజిల్‌ పురాణంలో ఉన్న మత్యకన్య అనే పేరు కలిసేలా ‘యారా’ అని పెట్టారట. ఇకపోతే ఇప్పటి వరకు కనుగొన్న వైరస్‌లకు ఈ వైరస్‌కు ఎలాంటి పోలిక లేకపోవడమే కాకుండా పూర్తి భిన్నంగా ఉండడం పట్ల శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారట.

 

 

ఇదే కాకుండా బ్రెజిల్స్‌ ఫెడరల్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ మినా జెరాయిస్‌ నాయకత్వంలోని పరిశోధన బృంధం యారా వైరస్‌ జన్యు క్రమాన్ని విశ్లేషించగా, మొత్తం 74 జన్యువులు  ఈ వైరస్‌లో ఉండగా, అందులో 68 జన్యువులను తాము ఇంతవరకు ఏ వైరస్‌లో చూడలేదని, గ్లోబల్‌ సైంటిఫిక్‌ డేటాలోని 8,500 రకాల జన్యువులతో పోల్చి చూసినా ఎక్కడా పోలిక దొరకలేదని ఆయన చెప్పారు. నేడు కరోనావైరస్‌ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త వైరస్‌ వెలుగులోకి రావడం విశేషమే.

 

 

ఇక ఈ వైరస్‌ను బ్రెజిల్‌లోని బెలో హారిజాంటే నగరంలోని ఓ కృత్రిమ సరస్సులోని ఏకకణ జీవి అమీబాలో కనుగొన్నారు. అయితే ఈ వైరస్ ఏక కణ జీవి అమీబాల్లోనే కనిపిస్తున్నందున, మనుషులకు సోకే ప్రమాదం లేకపోవచ్చని ఈ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారట. ప్రపంచంలోని మొత్తం సముద్రాల్లో గతంలో 15,222 రకాల వైరస్‌లను కనుగొనగా గత 2016 నుంచి 2019 మధ్య మూడేళ్ల కాలంలోనే దాదాపు 1,80,000 రకాల వైరస్‌లను కనుగొన్నారు.

 

 

వాటితో నీటిలో నివసించే వైరస్‌లు 1,95,728కు చేరుకున్నాయి. బహూశ సముద్ర జలాలు కలుషితం అవుతుండడం వల్ల వైరస్‌లు పెరిగి ఉండొచ్చేమో అనే అనుమానాన్ని ఈ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా మనుషులు చేస్తున్న వికృతమైన అరాచకాల వల్లే ఇలాంటి రోగాలు, వైరస్‌లు పుట్టుకోస్తున్నాయనడంలో సందేహం లేదు...

మరింత సమాచారం తెలుసుకోండి: