ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే.ఆరోజు  ఎంతోమంది తమ ప్రియమైన వారికి మనసులోని మాటను తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రేమలో ఉన్న వారు తమ ప్రియమైన వారికి ఎన్నో విలువైన బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇక పలు దేశాల్లో అయితే ప్రేమికుల రోజు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ప్రేమికుల రోజు జరుపుకోవడం అనేది పాశ్చాత్య పోకడల అయినప్పటికీ భారతదేశంలో కూడా ఎంతో ఘనం గా జరుపుకుంటారు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు అందరూ తమ ప్రియమైన వారికి వాలెంటెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ... అద్భుతమైన బహుమతులు కూడా ఇస్తుంటారు. ఎందుకంటే వాలంటైన్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైన రోజు కాబట్టి. 

 

 

 అయితే మామూలుగా ఏదైనా ఫెస్టివల్కు ఉన్నప్పుడు ఇండిగో  ఎయిర్లైన్స్ సంస్థ ప్రయాణికుల కోసం పలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అతి తక్కువ ధరకు విమాన టికెట్లు అందించి  సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండేలా ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ. వాలెంటెన్స్ డే సందర్భంగా ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తమ విమానాల ద్వారా  దేశంలోని పలు ప్రాంతాలకు ప్రయాణించడానికి ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఈ సందర్భంగా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ. 999 రూపాయలకే విమాన టికెట్లు అందిస్తూ వాలెంటైన్ ఆఫర్ ఇస్తుంది ఇండిగో ఎయిర్లైన్స్. 

 

 

 ఈ ఆఫర్లో భాగంగా ప్రయాణికులు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకుని విమాన ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే వాలెంటెన్స్ డే సందర్భంగా ప్రయాణికుల కోసం ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ మొత్తం పది లక్షల సీట్లు కేటాయించిందని ఇండిగో  యాజమాన్యం తెలిపింది. ఈ ఆఫర్ లో  టికెట్లు బుక్ చేసుకున్న వారు..మార్చ్  1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో ప్రయాణించాల్సి ఉంటుంది అని వెల్లడించింది. అయితే ఎన్నో రోజుల నుంచి విమాన ప్రయాణం చేయాలని ఆశతో  ఉన్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇండిగో  ఎయిర్లైన్స్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించడం తో ప్రస్తుతం ఎక్కువ మంది  టికెట్ కొనుక్కుని  విమాన ప్రయాణం చేసేందుకు ఎంతోమంది సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: