ఏపీ ప్రభుత్వం మరోసారి రైతుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. రైతు పక్షపాతినని జగన్ మరోసారి నిరూపించుకునన్నారు. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ఇప్పటి వరకూ భూ సమీకరణలో ఇస్తున్న నష్టపరిహారాలలను జగన్ సర్కారు అమాంతం పెంచేసింది. ఒక్కో విషయంలో దాదాపు మూడు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.



భూసేకరణలో ఇప్పటి వరకు పండ్లు, పూల తోటలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఓ మామిడి చెట్టుకు రూ. 2600 వరకూ పరిహారం ఇచ్చేవాళ్లు.. ఇప్పుడు దాన్ని ఏకంగా 7283 రూపాయలకు పెంచేశారు. గతంలో ఒక కొబ్బరి చెట్టుకు 2149 రూపాయలు పరిహారంగా ఇచ్చేవారు.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దాన్ని ఏకంగా 6090 రూపాయలకు పెంచేసింది. అలాగే.. గతంలో భూసమీకరణ సమయంలో ఒక నిమ్మ చెట్టుకు కేవలం 1444 రూపాయలు పరిహారంగా ఇచ్చేవాళ్లు.



ఇప్పుడు జగన్ ప్రభుత్వం దాన్ని 3210 రూపాయలకు పెంచేసింది. ఇలా దాదాపు అన్ని పండ్లు, పూల చెట్లుకు దాదాపు మూడింతలుగా పరిహారం పెంచేశారు. అంతే కాదు.. ఈ పరిహారం నిర్ణయించడంలోనూ గుడ్డిగా ముందుకు వెళ్లకుండా అన్ని రకాల రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు.



తోటల విషయంలో ఈ పరిహారం చెల్లింపులో మరింత స్పష్టత తీసుకొచ్చారు. తోట నాణ్యంగా పెంచుతూ ఉంటే వందశాతం పరిహారం ఇస్తారు. అయితే కొన్ని తోటల పోషణ సరిగ్గా ఉండదు. ఇలా పోషణ సరిగ్గా లేకుండా ఉంటే 80 శాతం పరిహారం ఇస్తారు. ఇక అసలు తోటను పట్టించుకోకుండా ఉంటే దానికి 60 శాతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: