ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి… ఏ పని మీద ఢిల్లీ వచ్చినా ఆయా పనులు వెంటనే చేయాలని, నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు సంబందించిన శాఖాదిపతులకు, మంత్రులకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో… బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేనాదిపతి పవన్‌ కళ్యాణ్‌ ఏ విధంగా స్పందించబోతున్నారో.? బిజెపితో పొత్తు పెట్టుకుని రాజకీయంగా తప్పటడుగు వేశారని మోడీ, అమిత్‌ షాను గుడ్డిగా నమ్మి రాజకీయంగా నష్టపోయారని పవన్‌ అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలిసింది.

ఇదంతా.. జగన్‌ పార్టీ నేతల కుట్ర. కావాలని మోడీ ఆశీస్సులు జగన్‌కు ఉన్నట్లు రాయించుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదు అంటున్నారు పవన్‌కు సన్నిహితంగా ఉండే నాయకులు. రాష్ట్రంలో చంద్రబాబు మళ్లీ బలపడకూడదు అని మోడీ, అమిత్‌ షాలు భావిస్తున్నారన్నది వాస్తవం. పవన్‌ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటే.. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా మారవచ్చునని మోడీ, అమిత్‌ షాలు భావించినప్పటికీ జగన్‌పై వ్యక్తమవుతోన్న ప్రజా వ్యతిరేకత ప్రభావం చంద్రబాబుకు అనుకూలంగా కలిసి వస్తుందని బిజెపి నేతలకు అర్దమైంది. ఒకవేళ మళ్లీ జగన్‌వైపే మోడీ, అమిత్‌షాలు మొగ్గు చూపితే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి పట్టడం ఖాయం. బిజెపితో పవన్‌ కళ్యాణ్‌ తెగతెంపులు చేసుకోవటం కూడా ఖాయమే అంటున్నారు రాష్ట్ర బిజెపి నేతలు.

ఢిల్లీలో మళ్లీ కేజ్రీవాలే గెలుస్తారని మోడీ, అమిత్‌షాలకు తెలుసునని కానీ ఇంత ఘోరంగా ఓడిపోతామని వారిద్దరు అనుకోలేదని బిజెపి నేతలు అంటున్నారు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మారతాయో.. ముందుముందు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకుంటే.. వారిద్దరు లాభపడతారు. మోడీ, అమిత్‌ షాను నమ్ముకుంటే.. నిండా మునిగి పోవటం ఖాయమంటున్నారు జనసేన కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు. అమరావతి రాజధాని విషయంలో పవన్‌ కళ్యాణ్‌ కొంత వెనకుడుగు వేస్తున్నారని ప్రచారం జరుగుతోన్న నేపధ్యంలో ముందు ముందు ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: