టీడీపీ అధినేత చంద్రబాబు కి దెబ్బ మీద దెబ్బ రాజకీయంగా తగులుతున్నాయి. సొంత పార్టీలో ఉన్న నాయకులే చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్న ట్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టిన చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు పనితీరు బాగోలేదని ఆ పదవి నుండి తప్పించాలని ఆలోచిస్తున్నారట. ఇదే తరుణంలో ఆ పదవిలో కింజారపు అచ్చెన్నాయుడుకి అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినబడుతున్న టాక్. ఇటీవల మూడు రాజధానుల విషయంలో అమరావతి ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపిన సమయంలో అచ్చం నాయుడు అమరావతి కి మద్దతు తెలపడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.

 

అంతేకాకుండా కింజరాపు అచ్చెన్నాయుడుకు ఉత్తరాంధ్ర జిల్లాలలో మంచి ఫాలోయింగ్ ఉందని, తన అన్న దివంగత సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు పట్ల ఉత్తరాంధ్ర ప్రజలకు ఉన్న ప్రేమ, సానుభూతి అచ్చెనాయుడికి పనికివస్తాయని పార్టీ సీనియర్లు చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు సమాచారం.  మరోపక్క రాయలసీమ ప్రాంతంలో పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతున్న ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు లో ఆందోళన స్టార్ట్ అయినట్లు టిడిపి వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి.

 

రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమ ప్రాంతాల్లో కూడా ఇన్చార్జిలు నియమించాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో ఇటు ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్చార్జిల నియామకాల విషయంలో చంద్రబాబు ఏం చేయలేని పరిస్థితిలో డైలమాలో ఉంటున్న తరుణంలో మరో పక్క అచ్చం నాయుడు తనకి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి మొత్తం పూర్తి బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు టిడిపి వర్గాల్లో టాక్. దీంతో ప్రస్తుతం అచ్చెన్నాయుడు విషయంలో చంద్రబాబు ఏం చేయలేని పరిస్థితిలో ఇరుక్కుపోయినట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: