ప్రేమ.. మనిషి జీవితంలో సుమధుర ఘట్టం ప్రేమ.. జీవితంలో ప్రేమలోపడని వారు చాలా అరుదు.. ఏదో ఒక వయస్సులో ప్రేమలో పడటం.. సర్వసాధారణం.. కొందరు ధైర్యంగా తమ ప్రేమను వెల్లడిస్తారు.. జీవితాన్ని ప్రేమమయం చేసుకుంటారు. ఇంకొందరు మౌనంగా మనసులోనే ఆరాధిస్తారు.

 

ప్రేమ విషయాన్ని చెప్పేందుకు జంకుతారు. చెబితే ఏమవుతుందో అని భయపడతారు. ఇలాంటి ప్రేమ కథలు ఎన్నో.. మన సాహిత్యం, సినిమాలు, టీవీలు అన్నింటిలోనూ ప్రేమ ఓ ప్రధాన కథావస్తువు అవుతుంది. మన జీవితాల్లో ప్రేమకు ఇంత ప్రాధాన్యం ఉంది.

 

అయితే కొందరు మాత్రం అసలు తాము ఎవరినీ ప్రేమించరు. ప్రేమ అన్న పదమే వీరి జీవితాల్లో ఉండదు. ఎందుకంటారా.. వీరికి ప్రేమ అంటే విపరీతమైన భయం ఉంటుంది. ప్రేమ అనే అంశాన్నే వారు దగ్గరకు రానీయరు. ప్రేమిస్తే ఏమవుతుందో.. వామ్మో ప్రేమ అని భయపడిపోతారు.

 

ఇది కూడా ఓ జబ్బేనట.. దాన్నే ఫైలోఫిబియా అంటారు. ప్రేమ అంటే భయపడిపోయి ప్రేమించని వారు కొందరైతే.. ఇంకొందరు అసలు వారికి ప్రేమ అనే భావనే అనుభవంలోకి రాదట. ఏం చేసినా వారికి ప్రేమ భావనను ఫీల్‌ కాలేరట.. ఇది కూడా జబ్బే.. దీన్ని హైపోపిట్యూటరిజం అంటున్నారు.

అయితే విచిత్రం ఏంటంటే.. వీరికి తాము ఈ జబ్బుకు లోనయ్యామన్న విషయమే వారు గుర్తించలేరు. ఇదొక తరహా జబ్బు అన్న విషయమే తెలియదు. కానీ గుర్తించినవారు.. కాస్త మానసిక శాస్త్రవేత్తలను ఆశ్రయించి.. మార్పు కోసం ప్రయత్నించవచ్చు. లేకపోతే.. ప్రేమ తాకని ఈ జీవితాలు మోడుబారి పోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: