అందమైన రెండు హంసలు.. ప్రేమగా ముక్కులు పొడుచుకునే దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో. అందులోనూ వాటి రూపం లవ్ సింబల్ ను పోలి ఉంటుంది. అందుకే వాటిని ప్రేమ ప్రతీకలుగా చెబుతుంటారు. అందమైన హంసలు హృదయాకృతిని ఎంత చక్కగా ఆవిష్కరిస్తాయో..

 

అయితే.. ఈ హంసలను ప్రేమ పక్షలుగా పిలుస్తారు.. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.

రొమాన్స్‌లో భాగంగా హంసలు ఒక దాని పట్ల మరొకదాని ఇష్టాన్ని తెలుపుకునేందుకు ఇలా ఎదురెదురుగా వచ్చి తలలు వంచి ముక్కుల్ని ఆన్చి నిలుచుంటాయట. ఈ హంసల ప్రేమ కబుర్లు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ఈ హంసల్లో చాలా రకాలు జీవితాంతం ఒకే భాగస్వామితో కలిసి ఉంటాయి.

 

మనుషుల్లో కాకుండా...ఇతర జాతుల్లో ఇలా ఒకే జీవిత భాగస్వామితో కలసి ఉండటం చాలా అరుదు. అందుకే కుక్కు ఉందా.. కోడికి ఉందా.. పెళ్లి ఆచారం అంటూ భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ అంటూ ఓ పాటలో కోట శ్రీనివాసరావు సెటైర్లు విసురుతారు. కానీ పెళ్లి గిల్లీ వంటి ఆచారం లేకపోయినా.. చాలా హంసలు తమ జీవితాంతం ఒకే భాగస్వామితో కలసి జీవిస్తాయట.

 

అంతేకాదు.. ఈ జంటలోని హంసలు రెండింటిలో ఏది చనిపోయినా రెండోది ఎక్కువ రోజులు బతకదట. ఆ దిగులుతోనే కొద్దిరోజుల్లోనే చనిపోతుందట. అందుకే హంసలను ప్రేమకు గుర్తుగా చెబుతారు. ఎంత ఘాటు హంస ప్రేమో కదా.. హంసలు పక్షులే అయినా ప్రేమ విషయంలో మిగిలిన పక్షల కంటే ఇంత ప్రత్యేకత చూపుతాయన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: