కేంద్రప్రభుత్వం వరస చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అలా వచ్చాయో లేదో మరుసటి రోజే  వినియోగదారులు వాడే గ్యాస్ ధర విపరీతంగా పెంచేసింది కేంద్రం. సబ్సిడీలు అన్నీ కలుపుకుని ఒక్కసారిగా  సుమారు 150 రూపాయలు పెరిగిపోయింది. దాంతో మధ్య తరగతి జనాలకు గ్యాస్ మంట బాగా మండుతున్నట్లే లెక్క.

 

ఇంతకీ ఢిల్లీ ఎన్నికలకు గ్యాస్ ధరలు పెరగటానికి ఏమిటి సంబంధం ? ఏమిటంటే ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్రమోడి బోర్లా పడిన విషయం అందరికీ తెలిసిందే. 70 సీట్లున్న అసెంబ్లీ ఎన్నికల్లో  అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 63 సీట్లు గెలుచుకుంది. గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నరేంద్రమోడి, అమిత్ షా  దాదాపు 15 రోజులు విపరీతంగా శ్రమించారు. అయినా వారికి దక్కింది ఏడంటే ఏడే సీట్లు.

 

ఢిల్లీ అంటేనే దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు నివసించే ప్రాంతమని అందరికీ తెలిసిందే.  ఎన్నికల్లో తమకు తలబొప్పి కట్టించిన జనాలంటే మోడికి బాగా మంటెక్కినట్లే ఉంది. అందుకనే గ్యాస్ ధరను ఒక్కసారిగా దాదాపు 150 రూపాయలు పెంచేశారు. లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో పెంచాల్సిన అవసరమే లేదు.  

 

గడచిన ఆరు నెలలుగా గ్యాస్ ధర పెరుగుతున్నా వినియోగదారులపై ఇంత భారంగా ఎప్పుడూ మారలేదు. కానీ  ఒకవైపు సబ్సిడి ఇస్తున్నట్లు చెబుతున్న కేంద్రప్రభుత్వం మరోవైపు గ్యాస్ సిలిండర్ల ధరలను అంతగా పెంచేయటం వల్ల వినియోగదారులకు ఒరిగేదేమీ లేదనే చెప్పాలి. ఇపుడు పెరిగిన ధరలు చూస్తుంటే ఓటర్ల మీద కోపంతోనే గ్యాస్ ధరలు బాగా పెంచేసినట్లు అనుకుంటున్నారు. తాము ఎంత కష్టపడినా ఓట్లు వేయని జనాల విషయాన్ని తాము మాత్రం ఎందుకు ఆలోచించాలన్న కోపమే మోడిలో కనబడుతోందంటూ వినియోగదారులు మండిపోతున్నారు. మరి పెరిగిన గ్యాస్ ధరల ప్రభావాన్ని జనాలు ఎలా తట్టుకుంటారో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: