ప్రేమ.. మనిషి జీవితంలో అత్యంత ప్రభావం చూపే ఓ భావన.. ప్రేమ కారణంగా పిచ్చోళ్లయినా వాళ్లు ఎందరో ఉన్నారు. తమ ప్రేమను సాధించడం కోసం గొప్పవాళ్లు అయిన వాళ్లూ ఉన్నారు. అంటే మనిషి మస్తిష్కంపై ఈ ప్రేమ అంత ప్రభావం చూపుతుందన్నమాట.

 

అందుకేనేమో.. తాము ప్రేమించినవారు దూరమైతే.. ప్రేమికులు ఈ బతుకే వ్యర్థం అనుకుంటారు. ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేది ఈ ప్రేమ విషయంలోనే.. అన్న సంగతి తెలిసిందే. ప్రేమ ప్రభావాన్ని వైద్యులు కూడా ధ్రువీకరిస్తున్నారు. వైద్య పరిభాషలోనూ ప్రేమ ప్రభావాన్ని వివరిస్తున్నారు.

 

ప్రేమ ఎంత డేంజరో తెలుసా మీకు.. ఎందుకంటే.. ఒక మనిషి డ్రగ్స్‌ వాడితే మెదడు ఎలా ప్రభావితమవుతుందో... ప్రేమలో పడినప్పుడూ అలాగే అవుతుందట. ప్రేమలో పడినప్పుడు అడ్రినలిన్‌, డోపమైన్‌, వాసోప్రెసన్‌ వంటి హార్మోన్లు విడుదలవుతాయట. అందుకే ప్రేమలో పడిన వ్యక్తికి అంత శక్తి వస్తుంది.

 

అందుకే ఈ ప్రేమ అనేక రోగాలకు ఓ మందుగా పనిచేస్తుందట. అంతే కాదు.. మనసుకు నచ్చిన వారిని గాఢంగా హత్తుకుంటే ఒంట్లో నొప్పులు తగ్గిపోతాయంటున్నారు పరిశోధకులు. వారి హత్తుకోకపోయినా.. కనీసం ప్రేమించిన వారి ఫొటోను చూసినా సరే... ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదలై నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: