బీజేపీ వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ప్రకటించిన ఢిల్లీ ఫలితాలు బీజేపీకి పెద్ద షాకే ఇచ్చాయి. ఆమ్‌ ఆధ్మీ పార్టీకి గట్టి పోటి ఇస్తుందని భావించిన బీజేపీ పోటి ఇవ్వకపోగా కేవలం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవ్వటంపై నాయకులు మథనపడుతున్నారు. ఈ సమయంలో బిజేపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర విభాగానికి చెందిన ట్విట్టర్‌ ఖాతా 24 గంటల పాటు బ్లాక్‌ అయ్యింది. కొందరు నెటిజెన్లు ట్విటర్‌ మేనేజ్‌మెంట్‌కు కంప్లయింట్‌ ఇవ్వటంతో అకౌంట్‌ను బ్లాక్‌ చేసినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా అభివృద్ధి చెందుతున్న దగ్గర నుంచి లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కొందరు ఆకతాయిలు చేసే పనుల కారణంగా ప్రముఖులు, కొన్ని సంస్థలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

 

వివరాల్లోకి వెలితే.. కర్ణాటక బీజేపీకి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్ర బీజేపీకి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతా 24 గంటల పాటు బ్లాక్ అయ్యింది. గత కొన్ని రోజులుగా సీఏఏకి అనుకూలంగా బీజేపీ చేస్తున్న వరుస ట్వీట్లు చేస్తోంది. దీనిపై కొందరు నెటిజన్లు ట్విట్టర్‌‌కు ఫిర్యాదు చేయడంతో... బీజేపీ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎవరు ఫిర్యాదు చేశారు అన్న విషయాన్ని మాత్రం ట్విట్టర్ వెల్లడించలేదు.

 

సోషల్ మీడియాలో చేసే పోస్టులు తమ నిబంధనలకు లోబడి లేకుంటే, ఇతరుల నుంచి అందే ఫిర్యాదుల ఆదారంగా ఖాతాను బ్లాక్ చేస్తుంటుంది ట్విట్టర్. కర్ణాటక బీజేపీ ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయినట్లు స్వయంగా బీజేపీ నేతలు ధృవీకరించారు. 24 గం.ల తర్వాత ఖాతాను అన్‌బ్లాక్ చేశారు. ట్విట్టర్ తీరుపై కర్ణాటక బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిజాలను చెబుతున్నందుకు తమ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేయడం దురదృష్టకరమని అదే అకౌంట్‌ నుంచి ట్వీట్ చేసింది కర్ణాటక బీజేపీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: