ఈ ప్రపంచంలో స్వచ్చంగా ఉన్నది ఉన్నట్లుగా చూపించేది ఏదంటే అద్దాన్ని చెప్పవచ్చూ. నీ మనసులో ఉన్న లోపాన్ని అది చూపించలేక పోవచ్చూ కానీ నీ ముఖంలో కనిపించే మచ్చను ఎలాంటి భయం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇకపోతే సమాజంలో మాయని మచ్చలా మనుషుల మనస్తత్వాలు మిగిలిపోతున్నాయి.. ఇందుకు నిదర్శనమే ఒక తల్లి తన బిడ్దపట్ల వ్యవహరించిన తీరు..

 

 

ఏ తల్లైనా తాను మరణించిన తన బిడ్దలను బ్రతికించు కోవాలని ఆరాటపడుతుంది. ఈ ప్రేమ ఒక మనుషులకే కాదు, ఈ భూమిమీద పుట్టిన ప్రతి జీవిలో కనిపిస్తుంది.. ఇలాంటి మాతృత్వాన్ని మట్టిలో కలిపిన ఒక తల్లి తీరు మనసున్న ప్రతి మనిషి కంట కన్నీరు పెట్టిస్తుంది.. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పులగాలిపాలెంలో జరిగిన ఈ విషాద ఘటన ఆ వివరాలు తెలుసుకుంటే .. గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి కరక అప్పారావు, కుసుమలత దంపతులకు సోనిక, జ్ఞానస  అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఈ నెల 6న అప్పారావు విధులకు వెళ్లిపోయాక, ఆ రాత్రి అత్తమామలు అప్పలకొండ, నూకాలుతో  కుసుమలతకు గొడవ జరిగింది.

 

 

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుసుమలత అదే రోజు అర్ధరాత్రి దాటాక ఇంట్లో నుంచి చిన్న కుమార్తె జ్ఞానసను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. ఆసమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆమె చినముషిడివాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న కొండ ఎక్కి నాలుగు రోజుల పాటు రేయింబవళ్లు అక్కడే ఉండి ఈ నెల 10న ఒంటరిగా కిందకి వచ్చింది కొండ సమీపంలో నివాసం ఉంటున్న వారి వద్దకు వెళ్లి ఆకలేస్తోందని చెప్పడంతో వారు భోజనం పెట్టిన తర్వాత ఏం జరిగిందని ఆరా తీయగా  ‘పాప ఆకలికి చనిపోయింది. నేనే కొండ మీద పూడ్చిపెట్టాను’ అని జరిగిన విషయం చెప్పింది.

 

 

దీంతో కంగారు పడ్డ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  ఇక జ్ఞానస చనిపోయిందని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. కుసుమలతను వెంటబెట్టుకుని కొండ ప్రాంతం అంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ బృందాలు డాగ్‌ స్క్వాడ్‌ సహా రంగంలోకి దిగాయి. ఎట్టకేలకు చిన్నారిని పూడ్చిన ప్రదేశాన్ని కనుగొన్నారు..

 

 

ఇదిలా ఉండగా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని అత్తింటి వారు ఏదైనా అన్నారా.. ఆ కోపంలో చిన్నారిని ఆమె ఏదైనా చేసిందా అన్నది సందేహంగా మారింది. అయితే ఇంత జరిగినా కుసుమలత నోరు విప్పడం లేదు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పకపోవడంతో పోలీసులకు ఎటూ పాలుపోవడం లేదు. జ్ఞానస పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఇందులో పురోగతి ఉండొచ్చని పోలీసులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా కన్న బిడ్దను పొట్టనపెట్టుకున్న ఈమెను తల్లి అనడంకంటే మరేదైనా పేరుపెడితే బాగుంటుందని అంటున్నారు కొందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: