ఇటీవల భారత్‌ లో రొడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ కు చెందిన వెహికల్స్‌ తరుచూ ప్రమాదాలకు గురి అవుతున్నాయి. అతి వేగంగా బండి నడపటం, నిర్లక్ష్యంగా బండి నడపటం లాంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ట్రాఫిక్స్‌ సిగ్నల్స్‌ పాటించకపోవటం కూడా ఈ ప్రమాదాలకు కారణం అంటున్నారు విశ్లేషకులు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది.


ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరోజాబాద్‌ ఇటావా బార్డర్‌ లోని ఆగ్రా లక్రో ఎక్స్‌ప్రెస్‌ వే పై ఈ ప్రమాదం జరిగింది. హైవే పే ఆగివున్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ కు చెందిన డబుల్‌ డెక్కర్‌ బస్సు వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన సమయం లో బస్సు లో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం రాత్రి సమయం లో జరగటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా చాలా మంది గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషయంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.


బస్సులో ఉన్నవారంతా విహరయాత్రకు వెళ్లి వస్తున్నట్టు గాయపడిన వారు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిదంటున్నారు. ప్రస్తుతం క్షతగాత్రలకు దగ్గలోని సైఫై మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ లో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను కూడా అదే ఆసుపత్రిలో ఉంచారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రమాదానికి కారణమైన 22 చక్రాల ట్రాలీ వాహనం నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై పార్క్‌ చేశారని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్లు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: