ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడంతో ప్రజలు ఈ వైరస్ పేరు వింటే చాలు భయపడిపోతున్నారు. తాజాగా జరుగుతున్న పరిశోధనల్లో కరోనా వైరస్ ఆడవాళ్లకంటే మగవాళ్లకే ఎక్కువగా సోకుతుందని తెలిసింది. పరిశోధకులు 140 మంది కరోనా పేషెంట్ల కేస్ రిపోర్టులను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు. 
 
కరోనా వైరస్ స్త్రీల కంటే పురుషులకు త్వరగా సోకుతోందని పురుషులలో కూడా 50 సంవత్సరాల వయస్సు పై బడిన సీనియర్ సిటిజన్లకు కరోనా త్వరగా సంక్రమిస్తోందని పరిశోధనలలో తేలింది. నిపుణులు కరోనా వైరస్ బారిన పడే వారిలో పురుషుల సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉందనే అంశం గురించి పరిశోధనలు చేస్తున్నారు. నిపుణులు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. 
 
ఇప్పటివరకు దాదాపు 1000 మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందగా 40,000 మంది కరోనా వైరస్ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. కరోనా వైరస్ బారిన పడిన వారిలో పేషెంట్ల సగటు వయస్సు 55.5 సంవత్సరాలుగా ఉంది. కొందరు వయస్సు పై బడిన వారిలో శక్తి ఉండదని అందుకే కరోనా ఎక్కువగా 50 సంవత్సరాల వయస్సు పై బడిన వారికే సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. 
 
గతంలో సార్స్ బారిన పడిన వారిలో కూడా ఎక్కువగా మగవాళ్లే ఉండటం గమనార్హం. అప్పట్లో మగ ఎలుకల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి జరిగింది. హృదయ సంబంధ రోగాలు, మధుమేహంతో బాధ పడేవారు కరోనా వైరస్ బారిన త్వరగా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కొందరు నిపుణులు మాత్రం చైనాలో సీ ఫుడ్ మార్కెట్లో ఎక్కువమంది మగవారు పని చేస్తారు కాబట్టి కరోనా వైరస్ బారిన పడే వారిలో ఎక్కువగా పురుషులు ఉన్నారని అంచనాలు వేస్తున్నారని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: