సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేయటంపై చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు విచిత్రమైన వాదన మొదలుపెట్టారు. అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలోని కియా కార్ల ఉత్పత్తి ప్లాంటును రామకృష్ణ సందర్శించాలని బుధవారం ప్రయత్నించారు. దాంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. దానిపై చంద్రబాబు, టిడిపి నేతలు వితండవాదం మొదలుపెట్టేశారు.

 

వాళ్ళ వాదన ఎంత విచిత్రంగా ఉందంటే కియా కార్ల పరిశ్రమను రామకృష్ణ సందర్శించకూడదా ? ఉత్పత్తి ప్లాంటును సందర్శిస్తామంటే అరెస్టు చేస్తారా ? అని అడగటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కియా కార్ల ఉత్పత్తి ప్లాంటు, కార్యాలయం పూర్తిగా  ప్రైవేటు ప్రాపర్టీ. దీనికి పబ్లిక్ తో ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా ఉత్పత్తి ప్లాంటులోకి వెళ్ళాలన్నా, ముఖ్యులను కలవాలన్నా ముందుగా వాళ్ళ అనుమతి  తీసుకోవాల్సిందే.

 

ఎటువంటి అనుమతి తీసుకోకుండానే తామిష్టం వచ్చినట్లు లోపలకు వెళతామంటే కుదరదు. ఈ విషయం చంద్రబాబుకో లేకపోతే టిడిపి నేతలకో తెలియందు కాదు. మూడు రాజధానులకు మద్దతుగా పార్టీ లైన్ కూడా దాటిపోయి రామకృష్ణ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి మద్దతుగా యాగీ చేస్తున్నారు కాబట్టే అరెస్టుకు వ్యతిరేకంగా అడ్డదిడ్డమైన వాదన మొదలుపెట్టారు.

 

అదే సమయంలో సచివాలయం అన్నది ప్రజలకు సంబంధించినది. మరి ఇదే సచివాలయంలోకి జనాలు రావాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలని ఇదే చంద్రబాబు  అధికారంలో ఉన్నపుడు  ఎందుకు నిబంధనలు విధించారు ?  ఎటువంటి  అనుమతి లేకుండానే సచివాలయంలోకి ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చా ?

 

సచివాలయం దాకా ఎందుకు టిడిపి పార్టీ కార్యాలయం ముందు భారీ ఎత్తున భద్రతను ఎందుకు పెట్టుకున్నారు ? పార్టీ అంటే ప్రజలకు సంబంధించిందే కదా ? అయినా వచ్చిన వాళ్ళను వచ్చినట్లు అందరినీ లోపలకు పంపేస్తారా ?  సందర్శకులను గేటు దగ్గరున్నన భద్రతా సిబ్బంది అడ్డుకోరా ?  మూడుసార్లు సిఎంగా చేసిన వ్యక్తి కూడా ఇంత చవకబారుగా వ్యవహరిస్తుంటే ఎలాగ ? కాస్త ఏమి మాట్లాడుతున్నారో చూసుకుని మాట్లాడితే బాగుంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: