తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని లక్షల ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా..  కాలేశ్వరం అనే బృహత్తర ప్రాజెక్టును ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును విడతలవారీగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే గోదావరి నీటితో కాలేశ్వరం ప్రాజెక్టు కళకళలాడుతోంది. బీడు భూములకు గోదావరి నీళ్లు చేరి  పంటపొలాలుగా  మార్చేందుకు... సిద్ధంగా ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టు లకు సంబంధించి పలు భారీ మోటార్లను కూడా  తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా  నిన్న రాత్రి కరీంనగర్ చేరుకున్నారు  ముఖ్యమంత్రి కేసీఆర్. ఈరోజు ఉదయం 9 గంటల 5 నిమిషాలకు కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం కరీంనగర్ నగర్ నుండి  హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. ఇక నేరుగా హెలిపాడ్  ద్వారా కాలేశ్వరం ప్రాజెక్టు కు చేరుకోనున్నారు  ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా గోదావరి ఘాట్ లో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరం  ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్కడి  ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా గోదావరి ఘాట్ ను సందర్శించనున్న  ముఖ్యమంత్రి కేసీఆర్... కాలేశ్వరం పరిధిలోని పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 

 

 

 ఇప్పటికీ 14 ఎంసీల నీటి నిల్వలతో కనువిందు చేస్తున్న లక్ష్మీ బరాజి  లోని పలు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ బరాజ్ లోని  పలు మోటార్లను  ప్రారంభించడంతో ఎంతో మంది రైతులు బీడు భూములకు గోదావరి నీరు చేరనుంది . కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని కొంచెం కొంచెంగా నెరవేరుతుంది. తెలంగాణ బీడు భూములు కూడా ఇప్పుడిప్పుడే సస్యశ్యామలంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి ఘాట్ ను సందర్శించిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రాష్ట్రాల సరి హద్దుల్లో కాలేశ్వరం ప్రాజెక్టు ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీ ఎత్తున టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. కెసిఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: