ప్రభుత్వానికి వ్యతిరేకంగా 45 రోజుల పాటు  చంద్రబాబునాయుడు డిసైడ్ చేసిన భారీ షెడ్యూల్ కు షాక్ తగిలింది.  ఈనెల మూడో వారం నుండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా  45 రోజులపాటు వివిధ దశల్లో నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టాలని చంద్రబాబు పార్టీ విస్తృత సమావేశంలో నిర్ణయించారు. అయితే క్యాబినెట్ నిర్ణయించిన స్ధానిక సంస్ధల ఎన్నికల షెడ్యూల్ తో  చంద్రబాబు డిసైడ్ చేసిన షెడ్యూల్ మొత్తం డిస్ట్రబ్ అయిపోయేట్లుంది.

 

ఇపుడు టిడిపి నేతల సమస్య ఏమిటంటే  జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలా ? లేకపోతే  స్ధానిక సంస్ధల ఎన్నికలకు రెడీ అవ్వాలా ?  ఎటూ తేల్చుకోలేక టిడిపి నేతలు నానా అవస్తలు పడుతున్నారు. అసలే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత నేతల పరిస్ధితి అస్తవ్యస్ధంగా తయారైంది. చాలామందికి చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం పోయింది.

 

ఈ కారణంగానే అవకాశం ఉన్న నేతలు బిజెపిలో చేరిపోతే మరి కొందరు నేతలు వైసిపి బాట పట్టారు. ఎటూ తేల్చుకోలేక టిడిపిలోనే ఉన్న నేతల్లో చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమధ్య చంద్రబాబు స్వయంగా జిల్లాల పర్యటనకు వెళ్ళినపుడు కూడా చాలామంది నేతలు గైర్హాజరైన విషయం అందరికీ తెలిసిందే.

 

అదే సమయంలో  సంక్షేమ పథకాల అమలుతో  జగన్ జనాల్లోకి బాగా చొచ్చుకుపోతున్నారు. అమ్మఒడి, స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టటం, వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరలు చెల్లింపు, రైతులకు ఏడాదికి రూ. 12500 విడుదల, గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఏర్పాటుతో పాటు అనేక సంక్షేమపథకాలను అమలు చేస్తున్నారు.

 

అనేక కారణాలపై జనాల్లో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది. అన్నింటికి మించి మూడు రాజధానుల ఏర్పాటు టిడిపిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కారణాలతోనే జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలపటంలో కూడా టిడిపిలో ఏకాభిప్రాయం రాలేదు. ఇదే సమయంలో ఎన్నికలను తెరపైకి తేవటంతో ఏమి చేయాలో  నేతలు తేల్చుకోలేకపోతున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: