లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ పోలీస్ స్టేషన్ నుండి పరారవ్వడం కలకలం రేపుతోంది. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డీడీవోగా విధులు నిర్వహిస్తున్నా రవీంద్రనాథ్ ఠాగూర్ నర్సులతో గత కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు నర్సులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆస్పత్రిలో పని చేసే ఒక నర్సు ఈ విషయం బంధువులకు చెప్పటంతో వారు వచ్చి ఠాగూర్ ను చితకబాదారు.            
 
ఒక నర్సును రాత్రి సమయంలో పిలిచి అత్యాచారయత్నం చేయడంతో రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నర్సు ఫిర్యాదు చేయటంతో బంధువులు దేహశుద్ధి చేయటంతో పాటు ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిన్న ఠాగూర్ ను అదుపులోకి తీసుకున్నారు. కానీ పోలీసుల కన్నుగప్పి ఆస్పత్రి నుండి ఠాగూర్ పరారయ్యాడు. 
 
పోలీసులు ఠాగూర్ కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ నుండి ఠాగూర్ పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు సమీప ప్రాంతాలలోని సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ జరుపుతున్నారు. పోలీస్ స్టేషన్ నుండి రవీంద్రనాథ్ ను ఎవరు తప్పించారు...? ఏ వాహనం ద్వారా ఠాగూర్ పరారయ్యాడనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
 
ఒకవైపు రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే కఠిన చట్టాలను అమలు చేస్తామని చెబుతున్నా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగటం లేదు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం వలనే రవీంద్రనాథ్ ఠాగూర్ స్టేషన్ నుండి పరారయ్యాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా రవీంద్రనాథ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల కళ్లుగప్పి రవీంద్రనాథ్ పారిపోవటంతో స్థానికంగా కలకలం రేగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: