2019వ సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల ముందు మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. అప్పటిలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిహత్య కేసును సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత టిడిపి పార్టీ వైయస్సార్ సిపి పార్టీల నడుమ మాటల యుద్ధం కొనసాగింది. సిబిఐ విచారణ చేయాలని జగన్ కోరగా... అప్పట్లో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం మాత్రం వివేకానందరెడ్డి కేసుపై సిట్ ను విచారణ చేయమని కోరింది. కానీ సిట్ విచారణలో నిందితులు ఎవరు దొరకలేదు.



అయితే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కొత్త సెట్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, వివేకా భార్య సౌభాగ్యమ్మ ఈ హత్య కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఇంకొక పిటిషన్ని వివేకానంద రెడ్డి కూతురు దాఖలు చేశారు. రెండు వారాల క్రితం ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తుది దశలో ఉందని అందుకే సిబిఐకి ఈ కేసును అప్పగించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.


ఈరోజు ఏపీ హైకోర్టు వివేకానంద రెడ్డి కేసు పై విచారణ చేపట్టింది. అయితే ఈరోజు మళ్లీ ఏపీ హైకోర్టు వివేకానందరెడ్డి కుటుంబ సభ్యుల తరుపు లాయర్ వాదనలను మరోసారి వింటున్నది. ప్రభుత్వం తరఫు న్యాయవాది కొంత సమయం కావాలని ధర్మాసనం ఎదుట ప్రస్తుతం కోరుతున్నాడు. ఈ హత్యలో ఎవరి హస్తం ఉందనేది తెలియాలంటే కొన్ని రోజులు పడుతుందని తెలుస్తోంది. తొందరలోనే తమ తండ్రిని హత్య చేసినవారిని పట్టుకొని కఠిన శిక్ష వేయాలని వైయస్ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: