టాలీవుడ్ టు బాలీవుడ్.. అన్ని ఇండస్ట్రీల్లోనూ హీరోయిన్‌ గా సత్తా చాటిన నగ్మా అగ్ర హీరోలందరితోనూ నటించి అభిమానులు మెప్పించింది. చెల్లెల్లిద్దరికీ పెళ్లయినా.. ఆమె మాత్రం ఒంటరిగానే ఉండిపోయింది. తాజాగా పెళ్లి పై స్పందించిన నగ్మా.. తాను పెళ్లికి వ్యతిరేకం కాదన్నారు. సరైన వ్యక్తి తారసపడినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పారు. దేవుడు ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడు, ఎవరితో రాసిపెట్టి ఉంటే వారితో తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు.


కెరీర్ పీక్ స్టేజ్‌ లో ఉండగా నగ్మా.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తో ప్రేమాయణం నడిపించిందనే పుకార్లు వినిపించాయి. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారమూ జరిగింది. అయితే, వాటిపై తాజాగా స్పందించిన నగ్మా.. సంచలన వ్యాఖ్యలే చేశారు. గంగూలీతో ప్రేమాయణం నిజమే. మేమిద్దం ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. అయితే నా వల్ల తన కెరీర్‌ కు నష్టం కాకూడదనే తప్పుకున్నా. ఇద్దరి కెరీర్స్ దెబ్బతిన కూడదనే ఉద్దేశం తోనే విడిపోయాం. ఆ సమయంలో అంతకు మించిన బాధ్యతలు నాకు చాలానే ఉన్నాయి. అందుకే ఇద్దరం విడిపోయాం అని చెప్పారు నగ్మా.


ప్రస్తుతం నగ్మా సినిమాలకు దూరంగా ఉంటున్నా రాజకీయాల్లో చేరి ప్రజలకు చేరువగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ లో యాక్టివ్‌ గా ఉండే నగ్మా, చాలా సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల సీనియర్‌ హీరోయిన్లు వరుసగా రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో నగ్మా రీ ఎంట్రీ పై కూడా చాలా వార్తలు వినిపించాయి. అయితే నగ్మా మాత్రం ఇంత వరకు రీ ఎంట్రీ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తెలుగులో 2002లో రిలీజ్‌ అయిన నిను చూడక నేనుండలేను నగ్మా చేసిన చివరి సినిమా, తరువాత బోజ్‌పూరి సినిమాలు ఎక్కువగా చేసిన నగ్మా 2009 తరువాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: