ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు నెలలుగా మూడు రాజధానుల అంశం గురించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఎంత చర్చ జరుగుతోందో అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల గురించి మెజారిటీ శాతం ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతుండగా కొందరు మాత్రం ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల గురించి ముఖ్యంగా ప్రజా సంఘాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 
 
కొందరు సినీ నటులు కూడా మూడు రాజధానుల అంశం గురించి స్పందించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన కాకినాడ శ్యామల తాజాగా ఏపీ మూడు రాజధానుల అంశం గురించి స్పందించారు. కాకినాడ శ్యామల మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ వైజాగ్ ను రాజధానిని చేయాలని చూస్తున్నారని కానీ వైజాగ్ ను ఎందుకు రాజధాని చేయాలని అనుకుంటున్నారో మాత్రం తనకు అర్థం కావటం లేదని అన్నారు. 
 
మనం తెలుగువాళ్లమని తెలుగు భాషను కాపాడుకోవటానికి మన వంతు ప్రయత్నాలు మనం చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే ఆలోచనను కాకినాడ శ్యామల తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారికి ఎక్కడ భూములు ఉంటే అక్కడ రాజధానిని పెడుతున్నాయని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వలన సామాన్య ప్రజలు బలైపోతున్నారని అన్నారు. 
 
వైసీపీ ప్రభుత్వం ఇకనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అనే ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. తాను ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నానని వారసులకు ఆస్తులను పంచేశానని ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నానని చెప్పారు. మరి కాకినాడ శ్యామల చేసిన విమర్శల గురించి వైసీపీ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: