అధికార-ప్రతిపక్షాల మధ్య  మొదలైన వివాదం కాస్త చివరకు మండలి కార్యదర్శి మెడకు చుట్టుకుంటోంది. నిబంధనలకు విరుద్దంగా తాను ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందే అంటూ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కార్యదర్శిపై ఒత్తిడి పెడుతున్నారు.  అదే సమయంలో నియమ, నిబంధనల ప్రకారమే నడుచుకోవాలంటూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అండ్ కో  చెప్పటంతో మధ్యలో కార్యదర్శి నలిగిపోతున్నారు.

 

ఇప్పుడు కార్యదర్శి పరిస్ధితి ఎలా తయారైందంటే విడవమంటే పాముకు కోపం...కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా ఉంది. సెలక్ట్ కమిటి ఏర్పాటు ప్రకటనలో ఛైర్మన్ మొదటినుండి నిబంధనలను ఉల్లంఘిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఛైర్మన్ కూడా టిడిపి సభ్యుడన్న ఏకైక అడ్వాంటేజ్ తో  చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు తెరవెనుక నుండి చెత్త రాజకీయాలు నడుపుతున్నారు. రాజకీయంగా అధికారపార్టీతో తేల్చుకునే శక్తి లేక చిరవకు అధికారులపై పడుతున్నారు. 

 

ఛైర్మన్ చేసిన సెలక్ట్ కమిటి ఏర్పాటు ప్రకటన  నిబంధనలకు విరుద్ధమంటూ కార్యదర్శి నియమ, నిబంధలను వివరిస్తు ఛైర్మన్ కు లేఖ రాశారు. సెలక్ట్ కమిటి ఏర్పాటుపై తాము చేసిన ప్రకటన తప్పని ఛైర్మన్ కు కూడా బాగా తెలుసు. నియమ, నిబంధనలకు విరుద్ధంగా తాము డిమాండ్ చేస్తున్న విషయం యనమల అండ్ కో కు తెలిసినా  అధికారపార్టీపై ఉక్రోషంతోనే ఇదంతా చేస్తున్నారు.

 

శాసనమండలి రద్దుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయటాన్ని టిడిపి తట్టుకోలేకపోతోంది. తమ పదవులు పోతున్నాయన్న కోపంతో  మండిపోతున్న టిడిపి నేతలు ఆ కోపాన్ని కార్యదర్శిపై చూపుతున్నారు. అధికార పార్టీలను ఏమీ చేయలేకపోతున్నామన్న కసిని కార్యదర్శిపై ఏదో ఓ రూపంలో చూపించాలని నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది. ఛైర్మన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కార్యదర్శిని సస్పెండ్ చేయిస్తామని, అరెస్టు చేయిస్తామంటూ బెదిరిస్తోంది.

 

అందుకనే పదే పదే మండలి కార్యదర్శిని ఇరుకున పెట్టేలాగ యనమల, ఛైర్మన్ ఫరీఫ్ తో పాటు టిడిపి సభ్యులు ప్రకటనలు చేస్తున్నారు. చూడబోతే కార్యదర్శిపై టిడిపి మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లే అనిపిస్తోంది. అధికారపార్టీని కాదని నియమ, నిబంధనలకు విరుద్ధంగా అదికూడా తాము అనుకున్నట్లుగా కార్యదర్శితో పనిచేయించుకోవాలన్న పిచ్చి ఆలోచనే యనమల ప్రకనల్లో కనబడుతోంది. మరి ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: