అందరికి తెలిసినట్టుగానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌వో తన సబ్‌ స్క్రైబర్లకు ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ మధ్య పీఎఫ్ ఆఫీస్‌‌లు, కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాటి సేవలను ఆన్‌ లైన్ చేస్తూ తీసుకొస్తుంది. మాములుగా పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయవచ్చు. పదవీ విరమణ వరకు ఎప్పుడు ఎవరు ఉండాల్సిన అవసరమే లేదు. మీ డబ్బులను ముందుగానే తీసుకోవచ్చు. అయితే ఐదు సంవత్సరాలలోపు పీఎఫ్ డబ్బులు విత్‌ డ్రా చేస్తే మాత్రం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పీఎఫ్ విత్‌ డ్రా అనేది అవసరం ప్రాతిపదికన మారుతూ వస్తుంది.

 

 

అలాగే ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వారు పీఎఫ్ డబ్బు కోసం ఆన్‌ లైన్‌ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదో ఒక కారణం చేత పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగి మరణిస్తే మాత్రం అప్పుడు పీఎఫ్ డబ్బులు ఏమౌతాయి...? వారికీ సంబంధించిన వారు ఆ పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు..? ఇలాంటి ప్రశ్నలు చాలానే వినిపిస్తాయి. పీఎఫ్ అకౌంట్ కలిగిన వ్యక్తి మరణించిన తర్వాత అకౌంట్‌ నామినీకి పీఎఫ్ డబ్బులు అందుతాయి.

 

 

పీఎఫ్ ఖాతాదారుడు ఏ కారణం చేతనైన మరణిస్తే మాత్రం అకౌంట్‌ లోని డబ్బులు మొత్తంగా నామినీగా తీసుకోవచ్చు. దీని కోసం ఈపీఎఫ్‌వో ఆఫీస్‌కు కూడా వెళ్లాల్సిన అసవరం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇదంతా ఆన్‌ లైన్‌ లోనే సులభంగా పీఎఫ్ డబ్బులను క్లెయిమ్ చేసుకొనే అవకాశం ఉంది. అయితే ఉద్యోగులు మాత్రం వారికి ఏమైనా జరిగి మరణం తర్వాత పీఎఫ్ డబ్బులు ఎవరికి వెళ్లాలనే అంశాన్ని ముందుగానే నిర్ణయం తీసుకోవాలి. వారికి నచ్చిన వారిని పీఎఫ్ అకౌంట్ నామినీగా రిజిస్టర్ చేసుకోవాలి. దీని కోసం ఈపీఎఫ్‌వో ఆన్‌ లైన్ ఈ-నామినేషన్ సదుపాయం కలిపిస్తోంది. మాములుగా పీఎఫ్ అకౌంట్‌ కు నామినీని జత చేసుకునేందుకు ఇనామినేషన్ ఫెసిలిటీ ఇందుకు ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్‌వో వెబ్‌ సైట్‌ కు వెళ్లి ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్, ఆధార్ నెంబర్‌ తో లింక్ అయ్యి ఉంటేనే ఈ సదుపాయాన్ని పొందగలం.

 

 


అవన్ని ఒక కోవకు చెందినది అయితే పీఎఫ్ అకౌంట్ నామినీని మార్చుకునే సదుపాయం కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ విషయాన్నీ కూడా ఆన్‌ లైన్‌ లోనే పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నామినీ ఆధార్ కార్డు నెంబర్ ని కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: