చాలా సందర్భాలలో సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్నవాళ్లు, ప్రముఖులుగా గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అప్పటివరకు సంపాదించుకున్న మంచిపేరును పొగొట్టుకుంటూ ఉంటారు. తాజాగా ఆ జాబితాలో ప్రముఖ మరాఠీ బోధకుడు ఇందూరికర్ మహరాజ్ చేరారు. అహ్మద్ నగర్ జిల్లాలోని సభలో ఇందూరికర్ మహరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. 
 
సోషల్ మీడియాలో ఇందూరికర్ మహరాజ్ చేసిన వ్యాఖ్యల గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇందూరికర్ మహరాజ్ సభలో మాట్లాడుతూ బేసి సంఖ్య ఉన్న రోజున సెక్స్ లేదా డేటింగ్ చేస్తే ఆడపిల్ల పుడుతుందని సరి సంఖ్య ఉన్నరోజున సెక్స్ లేదా డేటింగ్ చేస్తే మగ పిల్లాడు పుడతాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇందూరికర్ మహరాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ఇందూరికర్ మహరాజ్ ఇదే సభలో చెడు సమయంలో సెక్స్ చేస్తే పుట్టే బిడ్డ ఇంటికి చెడ్డ పేరును తెస్తారని మంచి సమయంలో సెక్స్ చేస్తే పుట్టే బిడ్డ మంచిపేరు తెస్తారని అన్నారు. మన చట్టాల ప్రకారం పుట్టేది ఆడబిడ్డా..? మగబిడ్డా..? అనే విషయాన్ని డాక్టర్ చెప్పకూడదని ఉంది. కానీ ఇలాంటి సున్నిత అంశాలపై ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇందూరికర్ మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 
 
సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారి స్థాయికి తగదని నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ఇందూరికర్ మహరాజ్ చేసిన వ్యాఖ్యల గురించి స్పందించారు. ఇందూరికర్ మహరాజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రీ కన్షెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఇందూరికర్ మహరాజ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ప్రజల నుండి కూడా ఇందూరికర్ మహరాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: