సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు మారుపేరైన అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్ మ‌రోమారు ఆస‌క్తిక‌ర ప‌రిణామంతో వార్త‌ల్లోకి ఎక్కాడు. దాదాపు 25ఏళ్లపాటు వైవాహిక జీవితం గడిపిన అనంతరం తన భార్య మెకంజీకి జెఫ్ బెజోస్ విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.  ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విడాకుల్లో అగ్రస్థానం పొందడం ద్వారా ఈ ఇద్దరి విడాకులు కూడా సంచలనంగా మారాయి. అనంతరం జెఫ్ బేజోస్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ లారెస్ సాంచేజ్​తో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. తాజాగా బెజోస్​ కొత్త ఇల్లు కొన్నాడు. అది ప్రియురాలికి ప్రేమికుల రోజు గిఫ్ట్​ అని భావిస్తున్నారు.

 

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని బెవ‌ర్లీ హిల్స్‌లో ఉన్న వార్న‌ర్ ఎస్టేట్‌ను బేజోస్ కొనుగోలు చేసిన‌ట్లు సమాచారం. ఆ ఎస్టేట్‌ను సుమారు 1200(165 మిలియ‌న్ల డాల‌ర్లు) కోట్ల‌కు కొన్న‌ట్లు ఓ ప‌త్రిక క‌థ‌నం రాసింది. ప్ర‌స్తుతం మీడియా మొగ‌ల్ డేవిడ్ గిఫెన్ వ‌ద్ద ఉన్నఈ ఇంటిని అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో రికార్డు ధ‌రకు బెజోస్​ కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు 10 ఎక‌రాలు ఉండే వార్న‌ర్ ఎస్టేట్‌ను 1990లో గిఫెన్ ఖ‌రీదు చేశాడు. 1937లో జాక్ వార్న‌ర్ ఆ ఎస్టేట్‌ను నిర్మించారు. అమెజాన్ చీఫ్ కొన్న ఇంటి గురించి ఇంకా పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కురాలేదు. జెఫ్ బేజోస్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ లారెస్ సాంచేజ్​కు ఈ ఇంటిని వాలైంటైన్స్​డే గిఫ్ట్​గా ఇవ్వనున్నట్లు సమాచారం.

 

కాగా, ఇటీవలే అమెజాన్ ఫౌండర్, సీఈవో  జెఫ్ బెజోస్ ఆయన  ప్రియురాలు లారెన్ శాంచెజ్ భారత్​లో పర్యటించిన సంగతి తెలిసిందే. మెజాన్ ఆపరేషన్స్‌ ఇతర పారిశ్రామికవేత్తలను కలిసేందుకు జనవరి 14 నుంచి మూడురోజుల పాటు భారత్‌లో జెఫ్ బెజోస్ పర్యటించారు. రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి తన భారత పర్యటనను జెఫ్ బెజోస్ ప్రారంభించారు. . తాజ్‌మహల్ దగ్గర ఈ జంట తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: