నా ఊపిరి నువ్వైతే... నేను ఉండనా నీ తోడుగా కడదాకా... నా ప్రేమ నువ్వైతే.. పడి ఉండనా నీ చింతన బానిస లాగా.. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం... నీతో ఉన్న ప్రతి క్షణం ఏదో తెలియని ఆనందం.. ఒక్క ఛాన్స్ ఇస్తే గుండెల్లో గుడి కట్టుకుంటా... కడదాకా నీ తోడుగా ఉండేందుకు కనికరిస్తావా ప్రియతమా...ఇలా ప్రేమికుల రోజు వచ్చిందంటే తమ ప్రియమైన వాళ్ళకి ప్రపోజ్ చేసే వాళ్ళు ఎంతోమంది. ఎన్నో ఏళ్లుగా తాము ప్రేమించిన వారికి మనసులోని మాట చెప్పలేక... ఒకవేళ చెబితే ఉన్న స్నేహం కూడా పోయే బాధ పడాల్సి వస్తుందేమో అని భయపడి తన ప్రేమ గురించి చెప్పకుండా ఉన్న వాళ్ళందరూ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఎలాగైనా ప్రేమ విషయం చెప్పెయ్యాలి అనే ధైర్యం చేసి ముందడుగు వేస్తారు. అందుకే వాలెంటెన్స్ డే అంటే ప్రేమికులకు ఎంతో స్పెషల్. 

 

 

 అయితే ఇది కేవలం యువతకే కాదు ప్రస్తుతం మహామహులు కూడా ఒకప్పుడు ప్రేమ లోకం లో మునిగి తేలిన వాళ్లే.. ప్రస్తుతం ఉన్న పెద్ద వాళ్ళందరూ ఒకప్పుడు యువకులే కదా. ఆ రోజుల్లో వారు కూడా ఎవరో ఒకరిని  ప్రేమించే ఉంటారు కదా.అయితే ఇలాంటి లవ్ స్టోరీస్ ఉన్నవారు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ లో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టిఆర్ఎస్ నేత  బాల్క సుమన్. అప్పట్లో ని బాల్క సుమన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని తన లవ్ స్టోరీ లో విజయం సాధించారు. బాల్క సుమన్ ఎస్టి కానీ వాళ్ళ భార్య మాత్రం గౌడ్ క్యాస్ట్. దీంతో ఇద్దరి  పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోలేదు. చివరికి మాజీమంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగల పద్మారావు గౌడ్ కూడా గౌడ క్యాస్ట్  కావడంతో ఒప్పించి  మంచి లైఫ్ ఉంటుందని పెళ్లి చేశాడు. 

 

 

 అయితే పెళ్లి జరిగిన సమయంలో బాల్క సుమన్ కు ఎలాంటి పదవి లేదు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెర మీదికి వచ్చాడు బాల్క సుమన్. ఇక ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక మొన్న 2019 లో జరిగిన ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే... విజయం సాధించి ఎమ్మెల్యేగా మారిపోయారు బాల్క సుమన్. అయితే తన లవ్ స్టోరీ గురించి ఒకానొక సమయంలో స్వయంగా బాల్క సుమన్ తెలియజేశారు. ఇకపోతే మొన్నటికి మొన్న బాల్క సుమన్ తల్లి ముత్తమ్మ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా కూడా గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: