నేటి సమాజపు పోకడలను గమనిస్తే యవ్వనంలోకి అడుగు పెడుతున్న వారిలో వస్తున్న మార్పులు అంతా ఇంతా కావు. ఎవరు మంచి చెప్పిన వినే స్దితిలో లేరు.. వారి వారి ఇష్టారీతిగా బ్రతకడానికి అలవాటు పడుతున్నారు. కనీసం వారి కోసం  ఇంటిదగ్గర తల్లిదండ్రులు ఎదురుచూస్తారు. మాకేమైనా అయితే వారు తట్టుకోలేరనే జ్ఞానం కూడా ఈనాటి పిల్లల్లో ఉండటం లేదు. తొమ్మిది మాసాల బరువును, ఒక చిన్న ఆలోచనలతో చంపేస్తున్నారు..

 

 

తమ పిల్లలు చక్కగా చదువుకుని, అందరి ముందు గౌరవంగా బ్రతుకుతారని తల్లిదండ్రులు తమ కడుపు చంపుకుని చదివిస్తుంటే, బ్రతుకు మీద భయం లేకుండా జీవిస్తున్నారనడానికి ఇప్పుడు మనం చూడబోయే సంఘటనే ఉదాహరణ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్ స్టేషన్‌లో జరిగిన ప్రమాదం తాలూకు దృశ్యాలు.. బస్ స్టేషన్ ప్రాంగణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.. ఆ వివరాలు చూస్తే..  ఒక కాలేజీ విద్యార్థి తరగతులు ముగిసిన అనంతరం ఇంటికెళ్లే క్రమంలో బస్సెక్కేందుకు ప్రయత్నిస్తూ.. అదే బస్సు కింద పడ్డాడు. క్షణాల్లో అతడు కిందపడటం, అతడి తల పైనుంచి బస్సు టైరు వెళ్లడం జరిగాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు..

 

 

నిజంగా ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారి కళ్లు చెమర్చక తప్పదు..  ఒక నిండు ప్రాణం  కళ్లముందే గాల్లో కలిసిపోవడం, నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనం.. ఈ తప్పును ఆర్టీసీ వారిపైనా వేసేది, లేక ఆ బస్సులో ప్రయాణించే వారిపైనా,  ఆ విద్యార్ది పైనా, దీని బాధ్యులు ఎవరని నిందించిన పోయిన ప్రాణం మాత్రం రాదు.. ఇకపోతే ఈ విద్యార్ధి ఎక్కడానికి ప్రయత్నించిన బస్సు అప్పటికే కిక్కిరిసిపోగా,  చాలా మంది విద్యార్థులు వెనక డోర్‌ ఫుట్‌బోర్డులోనే ఉండిపోయారు.

 

 

అయితే వెనుక డోర్ వద్ద నుంచి బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన ఆ పిల్లవాడు.. అక్కడ కాలు పెట్టడానికి కూడా చోటు లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ వెంటనే ముందు వైపునకు పరుగెత్తుకొచ్చి ఫ్రంట్ డోర్ నుంచి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పట్టుతప్పి టైర్ కిందపడిపోయాడు. తొలి ప్రయత్నాన్ని విరమించిన, ఆ బస్సును వదిలేసినా ప్రాణాలు దక్కేవే...  

 

 

చిన్నప్పటి నుండి చిన్న గాయం కూడా తగలకుండా అల్లారు ముద్దుగా పిల్లలను పెంచేది ఇలా నడిరోడ్డులో, ప్రాణాలు పోగొట్టుకోవడానికా, సమాజంలోని యువతి, యువకులు ఒక్క సారి ఆలోచించండి, మీరు చేస్తున్న గాయాలు తల్లిదండ్రుల జీవితాలకు చీకటి కూపాలు.. అప్పటి వరకు మీరే లోకంగా బ్రతుకుతున్న వారికి ఒక్క సారిగా చెప్పా పెట్టకుండా ఈ లోకం నుండి వెళ్లిపోతే ఇక వారి బ్రతుకులకు అర్ధం ఉంటుందా. ఇలా పిల్లలు చనిపోయారన్న వేదనతో ఎందరో తల్లిదండ్రులు మానసిక వేదనతో నిత్యం నరకం అనుభవిస్తూ, మీ జ్ఞాపకాలతో, బ్రతకలేక, చావలేక కొట్టుమిట్టాడుతున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: