కేంద్ర బడ్జెట్లో రైతాంగానికి అన్యాయం! గ్రామీణ ప్రాంతాలకు కోత, కార్పోరేట్లకు పెద్ద పీట వేసింది. కేంద్ర బడ్జెట్ పై దేశవ్యాప్త నిరసన - హైదరాబాదులో ఏ.ఐ.కే.ఎస్.సి.సి. రైతు సంఘాల ప్రదర్శన నిర్వహించాయి. సుందరయ్య పార్క్ వద్ద ఏ.ఐ.కే.ఎస్.సి.సి. భాగస్వామ్య రైతు సంఘాల ఉమ్మడి ప్రదర్శన జరిగింది. గ్రామీణ ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తిని పెంచటంలో బడ్జెట్ విఫలం. బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల వాటా 9.83 శాతం నుండి 9.30 శాతానికి తగ్గిపోయింది. ఆర్ధిక వ్యవస్థను మాంద్యం నుండి బయటికి తెచ్చే బదులు ఈ బడ్జెట్ కార్పొరేట్ల లాభాలను పెంచటానికే తోడ్పడుతుంది.   


ఢిల్లీ ఎన్నికల తర్వాత బీజేపి నాయకులు దేశమంతటా తమ ప్రభుత్వం సాధించిన ‘అభివృద్ధి’ పై ప్రచారం చేస్తామని ప్రకటించింది. అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలలో 90 శాతం ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలకు గత అయిదేళ్ళలో ఎటువంటి ‘అభివృద్ధి’ కనిపించట్లేదు. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఈ బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల కోసం, రైతాంగం కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని, గ్రామీణ ఆదాయాలు, కొనుగోలు శక్తి పెంచటం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని ఆశ పడిన రైతాంగానికి తీవ్ర నిరాశ మిగిలిందని ఏ.ఐ.కే.ఎస్.సి.సి నాయకులు ఆరోపించారు.

 

ఫిబ్రవరి 13వ తేదీన దేశవ్యాప్తంగా ఏ.ఐ.కే.ఎస్.సి.సి. బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, తెలంగాణా రాష్ట్రంలో అనేక జిల్లాలలో రైతు సంఘాలు నిరసనలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ఆర్థిక మంత్రి చేసిన బడ్జెట్ ప్రసంగం కూడా ఎన్నికల ప్రసంగంలా సాగిందని అయితే ఆ వాగ్దానాలకు భిన్నంగా బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల వాటా పెంచకుండా కోత విధించిందని, రైతులను మభ్యపెట్టే ప్రయత్నాన్ని బయట పెడుతూ బడ్జెట్ విషయాలపై కరపత్రాల ప్రచారం జరిగింది.

 

ఢిల్లీ ఎన్నికల తర్వాత బీజేపి నాయకులు దేశమంతటా తమ ప్రభుత్వం సాధించిన ‘అభివృద్ధి’ పై ప్రచారం చేస్తామని ప్రకటించింది. అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలలో 90 శాతం ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలకు గత అయిదేళ్ళలో ఎటువంటి ‘అభివృద్ధి’ కనిపించట్లేదు అని నాయకులు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: