చంద్రబాబునాయుడుకు సొంత గ్రామం నారావారి పల్లె పెద్ద షాక్ ఇచ్చింది.  స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని చంద్రబాబు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అందరికీ తెలిసిందే.  జనాల్లో వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక చివరకు ఏదో తప్పదు కాబట్టి అధికార పార్టీ ప్రతిపాదనకు మద్దతు పలికారు. అయితే  ఇదే విషయంలో నారావారి పల్లె స్కూల్లో మాత్రం సంపూర్ణ మద్దతు లభించింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే నారావారి పల్లెలో ఉన్న స్కూల్లో  ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టే విషయమై విద్యార్ధుల తల్లి దండ్రుల కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 15 మంది విద్యార్ధుల తల్లి దండ్రులు సమావేశం కావాల్సుంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ముగ్గురు విద్యార్ధుల తల్లిదండ్రులు హాజరు కాలేదు. అయితే హాజరైన 12 మంది విద్యార్ధుల తల్లి దండ్రులు మాత్రం ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని సంపూర్ణంగా మద్దతు పలికారు.

 

వాళ్ళ స్కూల్లోని 1వ తరగతి నుండి 5వ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం కావాలని తల్లి దండ్రుల కమిటి ఏకగ్రీవంగా నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ  నిర్ణయాన్ని చంద్రబాబు సొంత గ్రామమైన నారావారి పల్లెలోనే సంపూర్ణ మద్దతు దొరకటం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.  అంటే తల్లి, దండ్రులేమో తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలని కోరుకుంటున్నా చంద్రబాబు మాత్రం గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నట్లు అర్ధమైపోతోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ ప్రతిపాదించిన పథకాలు కావచ్చు లేదా తీసుకుంటున్న నిర్ణయాలను కూడా కావచ్చు వ్యతిరేకించాలన్న ఏకైక టార్గెట్ తోనే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని అర్ధమైపోతోంది. ప్రతిపక్షమంటే ప్రతిదీ వ్యతిరేకించటమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. జనాలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నా సరే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిందే అన్న ఆలోచననే జనాలు వ్యతిరేకిస్తున్నారు. మరి జనాల ఆలోచనను, జగన్ కు ప్రజలిస్తున్న మద్దతును చంద్రబాబు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: