దేశ రాజకీయాల్లో 2014 నుంచి బీజేపీ పెను సంచలనాలు నమోదు చేస్తోంది. మోదీఅమిత్ షా ద్వయం చేసే మ్యాజిక్ కు దేశమంతా బీజేపీ హవా సాగుతోంది. దశాబ్దాలుగా దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని తుడిచిపెట్టేశాయి వీరిద్దరి ఆలోచనలు. ప్రస్తుతం ప్రజలంతా ప్రధాని మోదీ చేతుల్లో సురక్షితంగా ఉన్నామని భావిస్తూ 2019లో మలిసారి కూడా ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. అయితే.. ఇక్కడో లాజిక్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది రాజకీయాల్లో మార్పా లేక ప్రస్తుత రాజకీయ సరళినా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

 

 

2014 తర్వాత 2019 ఎన్నికల్లో కూడా దేశంలో బీజేపీ హవానే సాగింది. ప్రజలంతా నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకున్నారు. దేశం మాత్తం బీజేపీ గాలి వీచి మోదీ హవాను నిరూపించింది. రీసెంట్ గా ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఆప్ దెబ్బకు బీజేపీ కుదైలైంది. మోదీ – షా తెలివితేటలు, మోదీ ప్రతిభ ఏమాత్రం పనిచేయలేదు. దీనినే రాజకీయ పక్షాలు ఊటంకిస్తున్నాయి. దేశ ప్రజలకు మోదీ ప్రధానిగా కావాలని కోరుకుంటున్నారు కానీ.. రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీని కోరుకోవడం లేదు అనేది ఓ చర్చనీయాంశంగా మారింది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే గెలుస్తున్నాయి కానీ.. బీజేపీ గెలుపు సాధ్యం కావడం లేదు.

 

 

ఢిల్లీలో కూడా పార్లమెంటుకు బీజేపీ ఎంపీలను పంపారు కానీ.. అసెంబ్లీకి వచ్చేసరికి ఆప్ ఎమ్మెల్యేలనే ఎన్నుకున్నారు. ఆంధ్రా, తెలంగాణ, ఒడిషా, తమిళనాడు, కేరళ, బెంగాల్, పంజాబ్.. ఇలా దాదాపుగా ఇతర పార్టీలే అధికారంలో ఉన్నాయి కానీ.. ఎక్కడా బీజేపీ లేదు. ఉత్తరప్రదేశ్ లో మాత్రమే బీజేపీ బలంగా కనిపిస్తుంది. గుజరాత్, కర్ణాటకలో రాజకీయాల కోణంలో మాత్రమే బీజేపీ ఉంది. మరి.. దేశంలో బీజేపీ హవా సాగుతుందా.. కేవలం మోదీ ప్రభంజనం మాత్రమేనా అనేది ప్రశ్నార్ధకం.

మరింత సమాచారం తెలుసుకోండి: