ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్(క్యాట్) ను ఆశ్రయించారు. తనపై చట్టవిరుద్ధంగా సస్పెన్షన్ విధించారని సస్పెన్షన్ ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటన చేయాలని కోరుతూ వెంకటేశ్వరరావు పిటిషన్ ను దాఖలు చేశారు. 2019 సంవత్సరం మే నెల నుండి ప్రభుత్వం తనకు జీతం చెల్లించడం లేదని పిటిషన్ లో వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 
 
తనపై సస్పెన్షన్ వేటు వేయడానికి రాజకీయపరమైన ఒత్తిళ్లే కారణమని క్యాట్ కు వెంకటేశ్వరరావు తెలిపారు. తన పిటిషన్ లో రాజకీయ ఒత్తిళ్ల వలన జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం సర్వీస్ నిబంధనలను అతిక్రమించి ఏబీ వెంకటేశ్వరరావు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో వెంకటేశ్వరరావును విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 
 
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో భద్రతా ఉపకరణాల కొనుగోలులో నిబంధనలను అతిక్రమించారని అందువలనే సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వం అనుమతి లేనిదే విజయవాడను వీడి వెళ్లరాదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ప్రజాప్రయోజనాలరిత్యా ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు వేసినట్లు తెలిపింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. 
 
ఎన్నికల సంఘం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ ఫిర్యాదు చేయటంతో ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుండి వెంకటేశ్వరరావు ను బదిలీ చేసింది. సస్పెన్షన్ కు గురైన వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో పిటిషన్ దాఖలు చేయడంతో క్యాట్ ఈ పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: