ప్రస్తుతం పోకిరీలు ఎక్కడపడితే అక్కడ ఉంటుండడంతో పోకిరీల ప్రవర్తనతో మహిళలు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజుల్లో పోకిరీలు మరింత రెచ్చిపోయి మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇక తాజాగా ఓ యువతికి ఇలాంటి ఘటనే జరిగింది. మెట్రో లో ప్రయాణిస్తున్న ఓ యువతి అక్కడే ఉన్న యువకుడి ప్రవర్తనతో భయభ్రాంతులకు గురి అయింది. ఎదురుగా నిలబడ్డ ఓ యువకుడు ఉన్నట్టుండి తన వైపుకు తిరిగి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి ఒక్క సారిగా షాక్ కు గురయింది. ఆ యువతికి కనిపించేలా మర్మాంగాన్ని ప్రదర్శిస్తూ నీచంగా ప్రవర్తించాడు ఆ యువకుడు. ఇది చూసిన బాధితురాలు భయంతోనే ఇంటికి వెళ్లి తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆ యువతిపై మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందించింది. ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైల్ లో చోటుచేసుకుంది. 

 

 వివరాల్లోకి వెళితే... ఆఫీసు పనులు ముగించుకుని ఓ యువతి ఢిల్లీ నుంచి గురుగ్రమ్  వెళ్లేందుకు సాయంత్రం 6 గంటల సమయంలో మెట్రో రైలు ఆశ్రయించింది. ఇక ఆ యువతి మెట్రో లో ప్రయాణిస్తున్న సమయంలో  సడన్ గా ఓ యువకుడు ఆమెకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఇక ఆమె వైపే చూడడం మొదలుపెట్టాడు. ఇక కొంతసేపటికే ఆ యువతి వైపు చూస్తూ నీచంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు యువకుడు. ట్రైన్ లోనే పాంట్  తీసి ఆమెకు తన మర్మాంగాన్ని చూపిస్తూ నీచంగా ప్రవర్తించాడు. అయితే ఆ యువకుడి ప్రవర్తనతో ఆ మహిళ భయపడిపోయింది. అయితే పాంట్ నుంచి మర్మాంగాన్ని బయటకు తీసిన ఆ యువకుడు... అది ఎవరికీ కనిపించకుండా బ్యాగ్  అడ్డం పెట్టాడు. ఇక తరచూ బ్యాగ్ ను  పక్కకు తీస్తూ అసభ్యంగా మర్మాంగాన్ని ప్రదర్శిస్తూ నీచంగా  ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ కంగారు పడిపోయింది. 

 

 తనకు ఎదురైన ఈ చేదు  అనుభవాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇంటికి వెళ్ళిపోయి సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురైన అనుభవం గురించి వెల్లడించింది మహిళ. అయితే ఆ మహిళ ట్విట్ పై  ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందించింది. మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న మహిళలకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించింది. వెంటనే స్పందిస్తామని తగిన చర్యలు తీసుకుంటామంటూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇక స్నేహితుల సహాయంతో ధైర్యం తెచ్చుకున్న యువతీ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితుల సాయంతో తనతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి ఫోటో సంపాదించినట్లు యువత తెలిపింది. కాగా ఈ ఫొటో సహాయంతో పోలీసులు అతని గుర్తించే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: