మొన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. గత మూడు ఎలక్షన్ల నుంచి రాజధాని ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకోవాలని కలలుకంటున్న జాతీయ పార్టీ అయిన బీజేపీ కి మరోసారి అది కలగానే మిగిలిపోయింది. మూడోసారి సంచలన మెజారిటీ ని సొంతం చేసుకుని ఆ పార్టీ అధికారాన్ని చేపట్టింది. కనీసం బిజెపికి మెజారిటీ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ  ఎన్నికల ఫలితాల్లో . మూడోసారి కూడా ఢిల్లీ ప్రజలు అందరూ కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపారు. ఏకంగా 62 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ విజయంతో హ్యాట్రిక్ సాధించినట్లయింది.

 


 ఇక చీపురుతో ఢిల్లీలోని కమలం పువ్వు లన్నింటిని ఆప్  పార్టీ క్లీన్ గా ఊడ్చేసింది  అనే చెప్పాలి . బిజెపి పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతున్నప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది అని చెప్పాలి. బీజేపీ వ్యూహాలన్నీ  ఢిల్లీ ప్రజలకు  కేజ్రీవాల్ పై ఉన్న నమ్మకాన్ని పోగొట్టు లేకపోయాయి.  అయితే ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజయోత్సాహంలో ఉన్నారు. అయితే ఇప్పటికే మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా పది లక్షల మంది ఆమ్ ఆద్మీ పార్టీ లో భాగస్వామ్యం  కావడంతో మరో విజయాన్ని సాధించారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే... ఆమ్ ఆద్మీ  పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలి  అంటూ సూచించింది.. 

 


 ఈ నేపథ్యంలో బహిరంగంగా ఆప్  పార్టీలో చేరలేని  కార్యకర్తలు కూడా మిస్సుడు కాల్ సదుపాయంతో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఏకంగా ఒక్కరోజులోనే దాదాపు 11 లక్షల మంది ఈ మిస్డ్ కాల్  సదుపాయం ద్వారా ఆప్ పార్టీలో  భాగస్వాములయ్యారు. అయితే దీనిపై పార్టీ స్పందిస్తూ ఒక్కరోజులోనే 11 లక్షల మంది పార్టీలో చేరారు. ఇది భారీ విజయం అంటూ ట్వీట్ చేసింది.ఒకవైపు కేజ్రీవాల్ విజయం పై అటు ప్రజల నుంచి కూడా భారీ ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మూడోసారి ఢిల్లీలో అఖండ విజయాన్ని సాధించడం చరిత్రలో నిలిచిపోయే విజయం అంటూ ఆప్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం తో పాటు కేజ్రీవాల్ క్యాబినెట్ లో మంత్రులు కూడా ఒక రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: