ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చైనాలో మృతుల సంఖ్య వెయ్యి దాటిన విషయం తెలిసిందే.  ఇక కరోనా ఎఫెక్ట్ మార్కెటింగ్ వ్యవస్థ పై కూడా దారుణమైన ప్రభావం చూపిస్తుంది.  తాజాగా పెట్రోల్, బంగారం, ఇతర వ్యవస్థల పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. తాజాగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ చికెన్ రేట్లపై కూడా చూపిస్తుందని అంటున్నారు. మార్కెట్లో కిలో 180 నుంచి 200 రూపాయల వరకు పలికిన కోడిమాంసం ధర, కరోనా వైరస్ దెబ్బకు సగానికి సగం పడిపోయంది.

 

పండుగల పూట కూడా మాంసాహారం మానని దేశప్రజలు, కరోనా వైరస్ కలిగిస్తున్న భయాందోళనలకు జడిసి, ప్రత్యేకించి కోడి మాంసాన్ని వద్దంటే వద్దంటున్నారు. ఫలితంగా మార్కెట్ ఢమాలుమంది.  కొన్ని చోట్ల అయితే ఏకంగా చికెన్, మటన్ ని అమ్మకాలు నిషేదించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక చికెన్ రేట్లు కొన్ని చోట్ల అయితే దారుణంగా పడిపోతున్నాయి. గతంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రభావం ఉన్నపుడు ఇలాంటి పరిస్థితి నెలకొంది.  ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వంద రూపాయలకు కిలో చికెన్ బేరం దొరకడంతో, వినియోగదారులు పోటీలు పడి మరీ ఎగబడ్డారు. కోడికూరా కావాలా.. రండి రండి బాబూ కిలో ఎనభై రూపాయలకే ఇత్తాం అంటూ... వ్యాపారులు ఆహ్వానాలు పలుకుతుండటంతో ఇదే సందని భావించిన వినియోగదారులు కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. 

 

అయితే కరోనా వైరస్ చికెన్, మటన్ పై ఉండదని కొంత మంది వ్యాపారులు చెబుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో సైతం, కిలో చికెన్ వంద నుంచి 120 రూపాయల లోపు పడిపోవడం గమనార్హం. కొన్ని చోట్ల కోడి గుడ్లు కూడా సగం ధర పడిపోయి, 30 రూపాయలకే డజన్ గుడ్లు అమ్ముతున్నట్లు తెలిస్తోంది.  మొత్తానికి కరోనా ప్రభావం చికెన్ పైనే చూపిస్తుందని.. ఆ వ్యాపారులు లబోదిబో అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: