ఈ మధ్య కాలంలో రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడంలో ఎన్నికల వ్యూహకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లలో ఘన విజయం సాధించటంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముఖ్య పాత్ర పోషించారు. తాజాగా రాబిన్ శర్మ అనే ఎన్నికల వ్యూహకర్తతో చంద్రబాబు చేతులు కలపబోతున్నాడని రాబిన్ శర్మ ద్వారా రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి చెక్ పెట్టనున్నాడని తెలుస్తోంది. 
 
ఈ రాబిన్ శర్మ గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేశాడు. ప్రశాంత్ కిషోర్ బృందంలో టాప్ 5 లో రాబిన్ శర్మ కూడా ఒకరు. ప్రశాంత్ కిషోర్ టీంలో సోషల్ మీడియా టీం లీడర్ గా రాబిన్ శర్మ వ్యవహరించారు. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సంస్థలో పని చేసిన రాబిన్ శర్మ ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ లా సొంత కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. రాబిన్ శర్మతో టీడీపీ ఒప్పందం చేసుకున్నట్టు గతేడాది సెప్టెంబర్ నెలలోనే వార్తలు వచ్చాయి. 
 
కానీ ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు రాబిన్ శర్మ మధ్య ఒప్పందం కుదిరిందని రాబిన్ శర్మ చంద్రబాబుతో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. చంద్రబాబు ఏపీ మూడు రాజధానుల అంశం గురించి ఇప్పటికే రాబిన్ శర్మతో చర్చించాడని రాబిన్ శర్మ బృందం ఏపీ రాజకీయ వాతావరణం గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఈ నెల చివరినాటికి చంద్రబాబుకు నివేదికనువ్వనుందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే రాబిన్ శర్మ జగన్ పై స్పెషల్ ఫోకస్ ప్లాన్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. రాబిన్ శర్మ తన పొలిటికల్ స్ట్రాటజీలను ఉపయోగించి తెలుగుదేశం పార్టీ ఏపీలో పునర్వైభవం పొందే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాబిన్ శర్మ ఏపీలో వైసీపీ పార్టీకి చెక్ పెట్టే విధంగా అడుగులు వేయబోతున్నాడని సమాచారం. మరి రాబిన్ శర్మ ప్రణాళికలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడటానికి ఉపయోగపడతాయో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: